Saffron Beauty benefits which imrpoves the glow of skin | Beauty Tips telugu | Lip Nails Problems

Saffron beauty benefits glowing skin lips problems nails tips home remedies

beauty tips, Saffron beauty tips, Saffron home remedies, Saffron beauty remedies, Saffron health tips, Saffron beauty products, Saffron juice

Saffron Beauty benefits glowing skin lips problems nails tips home remedies : By Using Saffron Home Remedies Women can get lots of beauty benefits. First they can get healthy glowing skin in lesser time and also beautyful lips

కుంకుమపువ్వుతో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్

Posted: 04/29/2015 03:15 PM IST
Saffron beauty benefits glowing skin lips problems nails tips home remedies

చర్మసౌందర్యాన్ని మెరుగుపర్చడంలో బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో తయారుచేసుకునే రెమెడీలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని బ్యూటీషియన్లు అంటున్నారు. ఎందుకంటే.. అటువంటి వాటిల్లో చర్మానికి కావలసిన పోషక విలువలు ఎంతో పుష్కలంగా వుంటాయి. వీటి ద్వారా రెమెడీలు చేసుకుంటే.. ఆ పోషకాలు నేరుగా చర్మం మీద ప్రభావం చూపుతాయి. తద్వారా తక్షణమే ఫలితాన్ని గమనించవచ్చు. కాబట్టి.. హోమ్ రెమెడీలనే ఎక్కువగా ఉపయోగిస్తే.. చాలా మంచిదని నిపుణులు సలహాలిస్తున్నారు. పైగా.. వీటి ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ వుండవని అటు ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇక విషయానికొస్తే.. చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే ప్రకృతి సహజ పదార్థాల్లో కుంకుమపువ్వు కూడా ఒకటి! ఈ పువ్వు ద్వారా ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ పొందవచ్చు. ఇది చర్మ సమస్యలతోపాటు పెదవులు, గోళ్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అలాగే.. దీనిద్వారా తయారుచేసుకునే రెమెడీలు చర్మానికి అప్లై చేసుకుంటే.. తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. ఎందుకంటే.. ఇందులో చర్మసౌందర్యాన్ని పెంపొందించే పోషక విలువలు ఎన్నో వుంటాయి. మరి.. ఈ కుంకుమపువ్వుతో బ్యూటీ రెమెడీ ఎలా చేస్తారో.. వాటి నుంచి కలిగే బ్యూటీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా...

1. కుంకుమపువ్వు చర్మఛాయను మెరుగుపరచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం... ముందుగా కుంకుమపువ్వును బాగా నులిమి, దానిని ఒక టేబుల్ స్పూన్ నీటిలో వేసి కొద్దిసేపటివరకు నానబెట్టాలి. కుంకుమ నీరు ఎరుపుగా మారిన తర్వాత అందులో కొద్దిగా కాసింత వెన్న వేసి కలియబెట్టాలి. పేస్టులా తయారేంతవరకు ఈ మిశ్రమాన్ని కలిపిన అనంతరం దాన్ని రోజూ ముఖానికి, పెదవులకు పట్టించాలి. ఇలా చేస్తే.. చర్మ ఛాయ మెరుగవడంతోపాటు పింకీ లిప్స్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే.. మొటిమలు, మచ్చల్ని దూరం చేసుకోవచ్చు. ఇదే మిశ్రమాన్ని గోళ్లకు రాసుకుంటే నెయిల్స్ షైనింగ్‌గా తయారవుతాయి.
 
2. చర్మాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ కుంకుమపువ్వుతోనే మరో విధమైన రెమెడీ తయారుచేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం.. ముందుగా ఒక పాత్రలో ఒక స్పూన్ కుంకుమ పువ్వు పొడి తీసుకుని అందులో కొన్ని చుక్కలు పాలు వేసి.. పేస్ట్‌లా కలియబెట్టాలి. అనంతనం ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మపు ఛాయ పెంపొందుతుంది. వారానికి ఒకసారి లేదా మాసానికి మూడు సార్లు ఇలా చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saffron beauty benefits  beauty tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more