sun tanning beauty treatments for women in home | Beauty Tips | Beauty Home Remedies

Sun tanning beauty treatments home remedies

Sun tan beauty tips, sun tan treatments, beauty home remedies, beauty tips, beauty tips for women, facial scrubs, facial beauty packs, beauty packs, home remedies, sun tanning treatements

sun tanning beauty treatments home remedies : Beauticians giving some beauty tips to remove sun tannings in home.

ట్యానింగ్‌ను తొలగించుకోవడానికి బ్యూటీ టిప్స్

Posted: 05/01/2015 04:38 PM IST
Sun tanning beauty treatments home remedies

సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మంపై నల్లని మచ్చలు ఏర్పడుతాయి. వాటినే ట్యానింగ్ (సన్ ట్యాన్) అంటారు. ఈ సమస్య కేవలం వేసవికాలంలోనే కాదు.. ఎప్పుడైనా సంభవించే అవకాశం వుంది. ఈ ట్యానింగ్ వల్ల సౌందర్యంగా వుండే ముఖం ఒక్కసారిగా అందవిహీనంగా మారిపోతుంది. ఇటువంటి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. కొన్ని సింపుల్ బ్యూటీ టిప్స్ బ్యూటీషియన్లు అందిస్తున్నారు. బ్యూటీ ప్రోడక్ట్స్ ని వాడటం కంటే ఆ టిప్స్ ని నిత్యం పాటిస్తే.. ట్యానింగ్ ను త్వరగా తొలగించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. మరి.. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందామా...

* ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా క్రీమ్‌ను, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరటేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తదితర పదార్థాలు వేసి, మెత్తని పేస్టులా అయ్యేవరకు బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పూసుకుని... 10-15 అలాగే వుంచుకోవాలి. ఆగిన తర్వాత శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ట్యాన్‌ తగ్గడమేకాకుండా చర్మానికి మంచి నిగారింపు కూడా వస్తుంది.

* ఒక గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మరసం వేసి.. మెత్తని మిశ్రమంలా బాగా కలియబెట్టాలి. ఈ పేస్టును ట్యానింగ్ ఉన్న ప్రదేశాల్లో రాసి, బాగా రుద్దుకోవాలి. 20 నిమిషాలు అలాగే వుంచిన అనంతరం చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేస్తే.. తక్షణమే ట్యానింగ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

* నిమ్మ సహజ సిద్ధమైన బ్లీచ్. టమోటా గుజ్జును నిమ్మ లేదా నారింజ రసంలో కలిపి.. మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును ట్యానింగ్ వున్న ప్రదేశాల్లో రాసి.. రుద్బుకోవాలి. కొద్దిసేపటి తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

* స్ట్రాబెర్రి గుజ్జు, పంచదార, నిమ్మరసం కలుపుకుని ట్యానింగ్‌‌గల ప్రదేశాల్లో స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. సున్నితమైన చర్మంగలవారు కాసిని బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి తోలుతీసి, రుబ్బి పుల్లని పెరుగు లేదా క్రీమ్‌తో కలిపి రాస్తే మరింతగా ఫలితం కనిపించే వీలుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sun tan beauty tips  sun tanning treatements  facial beauty packs  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more