చర్మసంబంధిత సమస్యలు ప్రతిఒక్కరిని నిత్యం వెంటాడుతూనే వుంటాయి. మొటిమలు, కంటికింద నల్లటి వలయాలు, ముడతలు పడటం, నల్లని పెదవులు, తక్కువ వయస్సుల్లోనే ముసలివారిలాగా కనిపించడం... ఇలా ఎన్నో ఇబ్బందులు వస్తూ వుంటాయి. ఇటువంటి సమస్యల్ని అధిగమించాలంటే తరుచూ బ్యూటీ ప్రోడక్ట్స్ వాడటం కంటే కొన్ని బ్యూటీ టిప్స్ పాటిస్తే చాలు. చర్మం ఆరోగ్యంగా వుండటంతో మెరుగైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే బ్యూటీ టిప్స్ కొన్ని మీకోసం..
బత్తాయి రసం బ్లీచ్ : ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత బత్తాయి కాయను రెండు ముక్కలుగా కట్ చేసి, దానిలో ఒక ముక్కను తీసుకోని నెమ్మదిగా ముఖాన్ని ఒక వృత్తాకార మోషన్లో స్క్రబ్ చేయాలి. ఈ విధంగా 10-12 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత ఒక మృదువైన వస్త్రం లేదా టిష్యూను ఉపయోగించి ముఖం మీద ఉన్న రసాన్ని, అవశేషాలను రబ్ చేయాలి. తర్వాత నీటితో ముఖంను కడగాలి. ఇలా నిత్యం చేస్తే ఎంతో ఫలితం కలుగుతుంది. బత్తాయికాయలో ఉండే సిట్రిక్ రసం ఒక సహజమైన తేలికపాటి బ్లీచ్‌గా పనిచేస్తుంది. ఇది బ్లాక్ హెడ్స్‌ను తగ్గిస్తుంది. ఇంకా చర్మ రంధ్రాలను శుభ్రపరచి చర్మం కాంతివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అదేవిధంగా బత్తాయిముక్కతో మెడ, చంకలలో, మోచేతులు, మోకాలు మీద రుద్దితే.. ఆయా ప్రదేశాల్లోని నల్లదనాన్ని తగ్గించవచ్చు. పెదవులమీద నల్లదనం, పగుళ్ళు తగ్గటానికి బత్తాయి రసంను 3-4 సార్లు రాస్తే ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.
టమోటా జ్యూస్ : రోజూ ఓ గ్లాసు టమోటా జ్యూస్‌తో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని బ్యూటీషియన్లు సలహా ఇస్తున్నారు. టమోటాలు రక్తప్రసరణను పెంచుతుంది. ఎందుకంటే టమోటోల్లో ఉండే విటమిన్ సి చర్మం సౌందర్యానికి అవసరం అయ్యే కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే టమోటోల్లా బెర్రీస్ కూడా చర్మ సౌందర్యానికి ఎంతగానో తోడ్పడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి స్కిన్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మార్చుతుంది.
మామిడి పేస్ట్ : పచ్చిమామిడికాయ పేస్ట్ లేదా బాగా పండిన మామిడి పండ్ల గుజ్జులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం ద్వారా చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ అందుతుంది. ఇంకా అవసరం అయితే అందులో కొద్దిగా బాదం ఆయిల్ కూడా మిక్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. బాగా పండిన మామిడిపండ్ల గుజ్జు తీసుకొని అందులో కొద్దిగా క్లే లేదా ఓట్స్, తేనె, పాలు వేసి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, తడి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more