మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా చర్మం ఆరోగ్యంగా వుండాలి. సౌందర్యం కోసం ఏదిపడితే అది బ్యూటీ ప్రోడక్ట్ ఉపయోగిస్తే అది ఎఫెక్ట్ అయి చర్మాన్ని దెబ్బతీస్తుంది. అప్పుడు సౌందర్యం కాదు కదా.. ఇంకా అందవిహీనంగా తయారవుతారు. నిజానికి మార్కెట్లో లభించే బ్యూటీ ప్రోడక్ట్స్ అందాన్ని పెంపొదిస్తాయి కానీ.. చర్మాన్ని ఆరోగ్యంగా వుంచవు. అలాంటప్పుడు వాటిని తరచూ ఉపయోగించడం కంటే.. సహజంగా లభించే హెర్బల్స్ ను వాడితే ఎంతో శ్రేయస్కరం. మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. మరి.. ఆ హెర్బల్ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* తేనె-క్రీమ్ : ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా తేనె, క్రీమ్ వేసి.. రెండింటిని బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. కొద్దిసేపు అలాగే వుంచుకున్న అనంతరం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేసుకుంటే.. చర్మం సాఫ్ట్ గా, కాంతివంతంగా కనిబడుతుంది.
* పాలు-ఉప్పు-నిమ్మరసం : ఒక గిన్నె తీసుకుని అందులో ఫ్రెష్ పాలు తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మీద మర్దన చేయాలి. ఇలా ప్రతిరోజూ రాత్రివేళల్లో చేసుకుంటే.. చర్మ రంద్రాలు శుభ్రపడి, మలినాలు దూరమవుతాయి.
* టమోటో జ్యూస్ : కొన్ని టమోటోలు మిక్సీలో వేసి జ్యూస్ లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ జ్యూస్ ని ఒక పాత్రలో వేసి.. అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, కొద్దిసేపు వుంచి, శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
* పసుపు-గోధుమపిండి-నువ్వుల నూనె : ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా పసుపు, గోధుమపిండి, నువ్వుల నూనె వేసి.. పేస్ట్ లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంచిత రోమాలు పూర్తిగా తొలగించబడుతాయి.
* క్యారెట్ జ్యూస్ : ఇతర చిట్కాలతో పోలిస్తే ఇది ఎంతో సింపుల్, బెటర్ కూడా! కొన్ని క్యారెట్ లను ముక్కలుగా కోసుకుని, వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం దానిని గాఢమైన జ్యూస్ లా చేసుకోవాలి. ఈ జ్యూస్ ను నేరుగా ముఖానికి పట్టించి.. కాసేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నేచురల్ గ్లో పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more