పోషకాహారలోపం, వాతావరణ కాలుష్యం ప్రభావం వల్ల చర్మసంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. చర్మం తేమ కోల్పోయి పొడి మారిపోవడం.. ఆ తర్వాత చిట్లిపోయినట్లుగా అనిపించడం.. మొత్తం అందవిహీనంగా మారడం.. ఇలా ఇంకా రకరకాల సమస్యలు వెంటాడుతాయి. వీటిని నివారించాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. బ్యూటీ ప్రోడక్ట్స్ లో వుండే కెమికల్స్ డ్యామేజ్ అయిన చర్మానికి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం వుంది కాబట్టి.. వాటికి దూరంగా వుంటూ ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
పొడిచర్మం సమస్య నుంచి బయటపడే చిట్కాలు..
* స్నానానికి వెళ్లే ముందు ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, సాఫ్ట్ గా మారుతుంది. కొద్దిసేపు ఇలా వుంచుకున్న తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే.. పొడిచర్మం సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇలాకాకుండా కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసిన నీటితో స్నానం చేసినా.. చర్మం తేమ కోల్పోకుండా ఉంటుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో తగినంత పాలమీగడ వేయాలి. అందులో చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పేస్టులా తయారైన ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. కాసేపు అలాగే వుంచుకున్న అనంతరం చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత ముఖాన్ని శెనగపిండి లేదా సున్నిపిండితో కడుక్కోవాలి. రెగ్యులర్ గా ఇలా చేస్తే.. పొడిచర్మం తొలగిపోయి.. చర్మం మృదువుగా, సాఫ్ట్ గా, సౌందర్యవంతంగా తయారవుతుంది.
* రాత్రపూట ఒక పాత్రలో కొద్దిగా నీరు వేసి అందులో 4 లేదా 5 బాదం గింజల్ని వేయాలి. ఉదయాన్నే ఆ గింజల తొక్క వలిచి, ఆ గింజల్ని మెత్తగా, పేస్టులా చేసుకోవాలి. అలా పేస్టు చేసుకున్న తర్వాత అందులో కొన్ని పచ్చిపాలను వేసి బాగా కలియబెట్టాలి. ఇలా తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే.. చర్మం తేమగా మారడంతోపాటు ఆరోగ్యంగా వుంటుంది.
* ఎన్నో ఔషధగుణాలు దాగివున్న కలబందని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం తేమగా మారుతుంది. ఒక పాత్రలో కాస్త కలబంద గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా పసుపును వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా తయారవుతుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో గుడ్డు పచ్చసొన, మీగడ, రోజ్ వాటర్లను వేసి బాగా కలియబెట్టాలి. పేస్టులా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా రాసుకోవాలి. కొంత సమయం తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారడాన్ని త్వరగా అరికట్టవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more