చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే సహజసిద్ధమైన ఫ్రూట్స్ లో ‘ఆపిల్స్’ ఎంతో ఉత్తమంగా సహాయపడుతాయి. ఈ ఆపిల్స్ తో రకరకాల మాస్కులను తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. కాంతివంతమైన సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ ఫ్రూట్స్ లో చర్మసంరక్షణకు కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ సి, ఏ లతోపాటు కాపర్, మరికొన్ని న్యూట్రీషియన్స్ ఎక్కువ మోతాదులో నిల్వవున్నాయి. ఈ ఆపిల్ చర్మాన్ని కాంతివంతంగా మార్చే కొల్లాజిన్ ని ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో సహకరిస్తుంది. ఇన్ని పోషకాలు కల్గిన ఈ ఆపిల్ తో రకరకాల ఫేస్ మాస్కులు తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. ఎన్నో ఫలితాలు పొందవచ్చు.
* ఆయిల్ స్కిన్ : ఒక పాత్ర తీసుకుని అందులో ఆపిల్ తురుము, ఒక చెంచా పెరుగు, ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. తరువాత 15 నిముషాల అలాగే మిశ్రమాన్ని వుంచుకున్న తర్వాత.. చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ఆయిలీ స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొంది.. నిగారింపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
* డ్రై స్కిన్ : ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆపిల్ తురుము, కొన్ని చుక్కల గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. కొద్దిసేపు మసాజ్ చేసుకోవాలి. అనంతరం 20 నిముషాలపాటు అలాగే వదిలేయాలి. కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల డ్రై స్కిన్ తొలగిపోయి.. మృదువైన, సాఫ్ట్ లా వుండే కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు.
* సెన్సిటివ్ స్కిన్ : ముందుగా ఒక చిన్న సైజు ఆపిల్ తీసుకుని.. దానిని వేడినీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అనంతరం తొక్కను తొలగించి తర్వాత మెత్తగా చేసుకోవాలి. అందులో బాగా పండిన అరటిపండు పేస్ట్, ఒక చెంచా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలియపెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 20 నిముషాలపాటు అలాగే వదిలెయ్యాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా చేస్తే ఫలితం గుర్తించవ్చు.
* మొటిమలకు : ఒక పాత్రలో ఆపిల్ తురుము వేసి.. అందులో తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్టును మొటిమలు ఎక్కువగా వున్న ప్రదేశంలో అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా ఈ మిశ్రమాన్ని పట్టిస్తే.. మొటిమలు, మచ్చలు పూర్తగా తొలగిపోతాయి. అంతేకాదు.. చర్మాన్ని ఎంతో స్మూత్ గా, సాఫ్ట్ గా, ప్రకాశించేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు చేస్తే చాలు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more