సున్నితమైన పెదాలు మెరుస్తూ, అందంగా కనిపిస్తేనే ముఖవర్ఛస్సు కూడా మరింత మెరుగవుతుంది. ముఖ్యంగా పెదాలు రెడ్ లేదా పింక్ కలర్ లో వుంటే.. చూపరులను ఇట్టే ఆకర్షించబడుతారు. అలాంటప్పుడు నిత్యం పింక్ కలర్ లో వుండే లిప్ స్టిక్స్ ఉపయోగించవచ్చు. కానీ.. దానిని తరచూ ఉపయోగిస్తే ఇతర ఇబ్బందులు రావొచ్చు. ఆ లిప్ కలర్స్ వల్ల పెదాలు తాత్కాలికంగా పింక్ కలర్ లో మారుతాయి కానీ శాశ్వతంగా వుండవు. పైగా.. వాటిని తగిలించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాకాకుండా నిత్యం పెదాలు పింక్ కలర్ లో వుండాలంటే.. నిమ్మరసం సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. మరి.. ఈ నిమ్మను పెదాల ప్రయోజనాలకు ఎలా ఉపయోగిస్తారో తెలుసుకుందామా..
* నిమ్మరసం-గ్లిజరిన్ : ఒక గ్లాసులో కొద్దిగా నిమ్మరసం వేసి, అందులో కాస్త గ్లిజరిన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేయాలి. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తే.. పెదాల నలుపు రంగు దూరమవడంతోపాటు అవి స్మూత్ గా మారుతాయి.
* లెమన్ జ్యూస్ బామ్ : నిమ్మరసాన్ని నేరుగా పెదాలకు అప్లై చేయకుండా ప్రత్యామ్నాయంగా నిమ్మరసంతో తయారుచేసిన లిప్ బామ్, లిప్ క్రీమ్, లిప్ జెల్స్ వంటివి ఉపయోగిస్తే.. ఎంతో శ్రేయస్కరం. ఈ లిప్ బామ్ ను పట్టించడం వల్ల పెదాలు సున్నితంగా, పింక్ రంగులోకి మారుతాయి.
* నిమ్మరసం-నెయ్యి : ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, రెండుమూడు చుక్కలు నెయ్యి వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రెగ్యులర్ గా అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదాలు పింక్ కలర్ లోకి మారి, ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి.
* లెమన్-రోజ్ వాటర్ : ఓ గ్లాసులో కొద్దిగా నిమ్మరసం తీసుకుని, అందులో రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు నేరుగా అప్లై చేయాలి. లెమన్ జ్యూస్ పెదాలను లైట్ గా మార్చుతుంది. రోజ్ వాటర్ నిమ్మరసంలోని యాసిడ్ రిఫ్లెక్షన్ ను తగ్గిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more