చర్మసౌందర్యాన్ని మెరుగుపరిచే రెమెడీల్లో ‘బాదం నూనె’ ఒకటి. ఇందులో చర్మానికి అవసరమయ్యే విటమిన్లు (ఏ, ఈ), పోషకాలు, మినరల్స్ వంటివి పుష్కలంగా వుంటాయి. ఈ బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. అలాగే ముఖంపై, శరీరంపైన ఏర్పడిన నల్లటి వలయాలు నిర్మూలించడంలో ఈ నూనె సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖవర్ఛస్సును మరింతగా మెరుగుపరుస్తుంది. ఇంకా.. ఈ బాదంనూనెతో కలిగే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
* ఒక పాత్ర తీసుకుని అందులో రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఈ విధంగా చేయడం ద్వారా నలుపు రంగుపోయి, తెల్లగా నిఘారింపుతో చర్మం మెరిసిపోతుంది.
* బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అర గంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా ఉంటుంది.
* చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర తీసుకుని కలపాలి. దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాలపాటు రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగాలి. ఇలా చేయడం వల్ల దీనివల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.
* రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తే.. చర్మం మెరుగ్గా తయారవుతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా బాదం నూనె, కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి.
* అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా తయారుచేసుకోవాలి. దీనిని నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
* బాదం నూనె, తేనె మిశ్రమాన్ని సముపాళ్లలో తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.
* ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more