రెగ్యులర్ వంటకాల్లో ఉపయోగించే టమోటాలు పోషకాల పుట్ట అని ఆరోగ్య నిపుణులు అంటారు. ఇతర కూరగాయలతో పోల్చితే.. టమోటాలో వున్న పోషకాలు, విటమిన్లూ మరే దానిలో వుండని వారంటున్నారు. ఈ టమోటా కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. అందుకే.. నిత్యం వంటకాల్లో దీనిని వేస్తే ఎంతో శ్రేయస్కరం. ఈ టమోటాతో రకరకాల రెమెడీలు చేసుకుని ముఖానికి పట్టిస్తే.. మంచి ఫలితం దక్కుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. మొటిమలు, ముడతలు, నల్లటి వలయాలు, సన్ టాన్ తదితర సమస్యల్ని నివారించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.
* ఒక గాజు పాత్ర తీసుకుని అందులో ఒక టమోటోని మెత్తగా చేసి వేయాలి. అనంతరం దాంట్లో చెంచా పెరుగూ, అరచెంచా తేనె, మూడు చెంచాల సెనగపిండీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని, ఆరేంతవరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ముఖంపై వుండే మొటిమలు, ముడతలు తొలగిపోయింది.. మేనిఛాయను పొందుతారు.
* ఒక పాత్ర తీసుకుని అందులో ఓ చెంచా టొమాటో రసం, ఓ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. గాఢంగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపు మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చర్మం మెరుగవడంతోపాటు మృదువుగా మారుతుంది.
* రెండు చెంచాల టమోటో గుజ్జులో, చెంచా కీరదోస గుజ్జూ, రెండు చెంచాల ఓట్స్ పొడీ, చెంచా పుదీనా ఆకుల మిశ్రమం తదితరాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి తాజాదనం వస్తుంది.
* ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల టమోటో రసం, మూడు చెంచాల మజ్జిగ వేసి బాగా కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చర్మంపై వుండే మురికి తొలగిపోయి.. ముఖం తాజాగా మారుతుంది.
* ఒక టమోటోని గుజ్జులా చేసి దానికి చెంచా నిమ్మరసం, అర చెంచా ఓట్స్ పొడీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, కాసేపు వేళ్లతో రుద్దాలి. తరువాత చన్నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more