చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతుంటారు. ప్రతిరోజూ తలస్నానం చేసినా, ఇతర ప్రోడక్టులు ఉపయోగించినా చుండ్రు పూర్తిగా తొలగిపోదు. కొన్ని సందర్భాల్లో చుండ్రు పొక్కులుగా ఊడి వస్తుంటుంది. ఫలితంగా కాలక్రమంలో జుట్టు ఊడిపోతుంది. పొడిబారిపోయి, చిట్లిపోతుంటుంది. ఇంకా మరెన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి.. చుండ్రును ఎంత వీలైతే అంత త్వరగా తొలగించుకుంటే చాలా మంచిదని బ్యూటీషియన్లు అంటున్నారు. చుండ్రు నుంచి ఉపశమనం పొందాలంటే ఎక్కువ ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం, మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే రెమెడీలు చేసుకుని, రెగ్యులర్ గా వాటిని పాటిస్తే.. తక్షణమే విముక్తి పొందవచ్చు. మరి.. అవేంటో తెలుసుకుందామా..
* మందారపువ్వులను కొబ్బరినూనెలో వేసి బాగా మరగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలో వేసి కాసేపు వుంచాలి. ఆ తర్వాత దాన్ని తలకు రాసుకుని, కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. అనంతరం తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల చుండ్రు అదుపులోకి వస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. మందారం జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో వేయాలి. పది నిమిషాలు ఉంచి, వాటిని బయటికి తీసేయాలి. అనంతరం వాటిని బాగా పిండి, నీటిని వేరు చేయాలి. అలా వేరు చేసిన నీటిని మాడుకు బాగా పట్టించాలి. కాసేపు మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత అలాగే వుంచి, బాగా ఆరనివ్వాలి. అనంతరం తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు శుభ్రపడటంతో పాటు చుండ్రు మటుమాయమవుతుంది. ఈ రెమెడీ ఎంతో మేలని నిపుణులు సూచిస్తున్నారు.
* చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటే.. ఒక పాత్రలో ఏడు చెంచాల గోరింటాకు పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా కొబ్బరి పాలు, కొద్దిగా యూకలిప్టస్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి ముప్పావు గంటపాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయగలిగితే చుండ్రు సమస్య నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more