యుక్తవయస్సులో ప్రతిఒక్కరిని వేధించే సమస్య ‘మొటిమలు’. వీటిని నిర్మూలించేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రెగ్యులర్ గా ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్ ను ఉపయోగించడమో, బ్యూటీ పార్లర్ కు వెళ్లడమో, ఇంకా ఇతర పద్ధతుల్ని అనుసరిస్తుంటారు. అయినప్పటికీ ఆ మొటిమలు అంత త్వరగా వెళ్లిపోవు. కాగా.. చర్మ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం కూడా వుంటుంది. అలాంటప్పుడు కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలు పాటిస్తే.. వీటి నుంచి త్వరగా ఉపశమనం పొందడంతోపాటు మెరుగైన సౌందర్యం పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* ఒక పాత్రలో కొత్తిమీర రసం తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
* ఒక గ్లాస్ పాత్ర తీసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్, కాస్త కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. అలాగే ఆవిరిపెడితే.. ముఖం మీద వుండే నల్లమచ్చలు త్వరగా తొలగిపోతాయి.
* ఒక పాత్రలో నిమ్మకాయ రసం, కోడిగుడ్డులో తెల్లసొన, పసుపు సమపాళ్ళలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. మొటిమలు మటుమాయమవుతాయి.
* ఒక పాత్రలో కాస్త పెరుగు తీసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more