పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి. పలు సంస్థలు భవిష్యత్తును శాసించే విద్యుత్ కార్లలోని కొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు సిద్దం కాగా మరికొన్ని సంస్థలు సంప్రదాయబద్దంగా వస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంధనంతో నడిచే కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా తన తొలి ఈవీ ఎస్‌యూవీని ప్రదర్శించగా, ఇక టాటీ కూడా మరో విద్యుత్ కారును అందుబాటులోకి తీసుకురానుంది.
ఇక ఆ జాబితాలో టయోటా కిర్లోస్కర్ కూడా చేరిపోయింది. టోయోటా మాత్రం తన సంప్రదాయ ఇంధన కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తాజాగా కార్ల వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్బన్ క్రూయిజర్ హై రైడర్ మోడల్ కారు మార్కెట్లో తీసుకొచ్చింది. ఈ కారు నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు లభ్యం అవుతుంది. రూ.15.11 లక్షల నుంచి రూ.18.99 లక్షల మధ్య ఈ కారు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నది. గత జూలైలోనే దీన్ని టయోటా ఆవిష్కరించింది. ఇది హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్తోపాటు త్వరలో మార్కెట్లోకి రానున్న మారుతి గ్రాండ్ విటారా వేరియంట్ కార్లతో తల పడనున్నది.
సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రీడ్ పవర్ ట్రైన్‌తోపాటు అర్బన్ క్రూయిజర్ హైరైడర్ నియో డ్రైవ్ కారు అందుబాటులో ఉంటుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, తొమ్మిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ చార్జర్, ఏడంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఐ-కనెక్ట్ క్రూయిజ్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో రెండు ఇంజిన్ చాయిస్‌లు ఆఫర్ చేస్తున్నారు. టయోటా డెవలప్ చేసిన లీటర్ టీఎన్జీఏ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 92 హార్స్పవర్, 122 ఎన్ఎం టార్చ్ వెలువరిస్తుంది. న్యూ బ్రెజాలో మారుతి సుజుకి వాడుతున్న 1.5 లీటర్ల కే15సీ మైల్డ్ హైబ్రీడ్ ఇంజిన్ కూడా ఇందులో లభిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more
Aug 16 | ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో... Read more