రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. భవిష్యత్తులో నిశబ్దంగా దూసుకెళ్లే బుల్లెట్ బైక్‌లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ తమ బ్రాండ్ నుంచి ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వార్తలు ఎన్నో వినిపించినా.. తాజాగా కొన్ని నివేదికలు వీటిని నిజమని సూచించడంతో నిశ్భద్ద బులెట్ల కోసం అభిమానుల నిరీక్షణలు కొనసాగుతున్నాయి.
రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బుల్లెట్ రాబోతుందని గత రెండు, మూడేళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని లిమిటెడ్ ఎడిషన్‌లో అయినా రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురావాలని కంపెనీ ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. 2025 ద్వితీయార్థంలో లేదా 2026 ప్రారంభంలో ఆర్ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్ మార్కెట్లోకి రానున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
మరి భవిష్యత్తులో వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎలా ఉండవచ్చు? ఎన్ని కిలోమీటర్ల రేంజ్ అందివ్వగలవు అనే అంశాలపైనా కొన్ని అంచనాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మోటార్ కెపాసిటీ కూడా పెట్రోల్ బైక్ మోడళ్లలో ఉన్నట్లుగా 350cc నుంచి 650cc వరకు సమానమైన మోటారు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శక్తివంతమైన టార్క్‌తో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అదే మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఈ బైక్ మెయింటెన్స్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ (ఈవీ) కూడా లాంగ్-రేంజ్ అందించే సౌకర్యవంతమైన బైక్‌గా ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 10kwh బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిమీ నుంచి 500 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఛార్జ్ చేయడానికి సుమారు 8-10 గంటలు పడుతుంది అని రిపోర్ట్స్ పేర్కొన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఐషర్ మోటార్స్ తయారు చేస్తుంది. ఎలక్ట్రిక్ బుల్లెట్ ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ వర్గాలు ఒక ఏజెన్సీతో మాట్లాడుతూ హై-ఎండ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోడళ్లపై కస్టమర్ల అంచనాలను ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more
Aug 16 | ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో... Read more