విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. అయితే, తొలి 10 వేలమంది కస్టమర్లకే ఈ ధర అని పేర్కొంది. ఆ తర్వాత ధర ఎంత ఉంటుందనేది కంపెనీ వెల్లడించలేదు. అక్టోబర్ 10 నుంచి వీటి బుకింగ్స్ ప్రారంభమవుతాయని, వచ్చే ఏడాది జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ పేర్కొంది.
ఇక కారు స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. 19.2kWh ఆప్షన్‌తో వస్తున్న వేరియంట్ 3.3 kW AC ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. సింగిల్ ఛార్జ్‌తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 24 kWh బ్యాటరీ వేరియంట్ కారు 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఇది బ్యాటరీని 3.36 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేస్తుందని తెలిపింది. డీసీ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 57 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఫుల్ ఛార్జ్‌తో ఈ కారు ద్వారా 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ ORVMs, క్రూజ్ కంట్రోల్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్, లెదర్ సీట్స్, ఆటో హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్ ఇస్తున్నారు. రిమోట్ ఎయిర్ కండీషనింగ్ కంట్రోల్, రిమోట్ జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి మొత్తం 45 కనెక్ట్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ విద్యుత్ కార్లలో వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి రూ.1100 ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల (ఏది ముందైతే) వారెంటీ ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more
Aug 16 | ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ వేరియంట్ ఓలా ఎస్1ను అధికారికంగా లాంఛ్ చేసింది. ఓలా ఎస్1 ప్రొతో పోలిస్తే చిన్న బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ 99,999కి అందుబాటులో... Read more