Prince mahesh babu and kajal latest movie shooting fom 23 rd of this month

prince mahesh babu and kajal latest movie shooting fom 23 rd of this month

prince mahesh babu and kajal latest movie shooting fom 23 rd of this month

17.gif

Posted: 04/13/2012 09:45 PM IST
Prince mahesh babu and kajal latest movie shooting fom 23 rd of this month

              mahe_innతన తాజా చిత్రం 'బిజినెస్ మేన్' సినిమాతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మహేష్ బాబు, కాజల్ జంట మరో సందడికి సిద్ధమైపోతోంది. వీరిద్దరూ కలిసి ఓ పాట పాడుకోవడానికి తగ్గా అందమైన సెట్ వాతావరణాన్ని ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదులోని అన్నపూర్ణా ఏడెకరాల లొకేషన్లో ప్రత్యేకమైన సెట్ ను వేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 'దూకుడు' చిత్ర నిర్మాతలు నిర్మించే చిత్రం కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
               హీరో హీరోయిన్లపై పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగును ఈ నెల 23 న ప్రారంభిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
              వరుస విజయాలతో యమ జోరుగా ఉన్న ప్రిన్స్ మహేష్ మొత్తానికి ఈ సినిమాను కూడా సంచలన విజయం చేయాలని  ఆశతో ఉన్నారు. ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా లెక్చరర్ పాత్రలో కాజల్ నటిస్తుంది. మొదటగా మహేష్ బాబు లెక్చరర్ గా నటించబోతున్నాడంటూ అంతా భావించారు. అయితే చివరికి సుకుమార్ కాజల్ ను టీచర్ ను చేశాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venu as a charector artist in dammu movie
Actress poonam kour opens a optical shop in hyderabad today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles