Venu as a charector artist in dammu movie

venu as a charector artist in dammu movie

venu as a charector artist in dammu movie

18.gif

Posted: 04/13/2012 10:04 PM IST
Venu as a charector artist in dammu movie

         venu_inఎంత మంచిగా అభినయించినా సరైన అవకాశాలు, విజయాలు అందుకోలేక పోయిన నటుడు వేణు.  'స్వయంవరం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన వేణు, తనదైన స్టైల్లో ఆడియన్స్ కి చేరువయ్యాడు. 'హనుమాన్ జంక్షన్' ... ' యమగోల మళ్లీ మొదలైంది' వంటి హిట్స్ ఇచ్చిన వేణు, ఆ తరువాత ఆశించిన స్థాయి విజయాలను అందుకోలేక పోయాడు. వేణు కథానాయకుడిగా ఆ మధ్య వచ్చిన 'గోపి - గోపిక - గోదావరి' ... 'మాయలోడు' వంటి చిత్రాలు తమ ఉనికిని కూడా చాటుకోలేకపోయాయి.
దానికి తోడు వేణు హీరోగా నటించిన 'రామాచారి' సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది.
        యువ కథానాయకుల పోటీని తట్టుకోలేమనే సంగతి అతనికి అర్ధమైపోవడంతో, తాజాగా వేణు తన రూటు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇకపై క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగాలని నిర్ణయించుకున్నాడేమో 'దమ్ము' చిత్రంలో కథానాయిక సోదరుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా తరువాత అతను ఈ తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపించే అవకాశం ఉందనిపిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu manoj crying over racha movie
Prince mahesh babu and kajal latest movie shooting fom 23 rd of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles