Ramcharan latest movie title merupu

ramcharan, ramcharan latest movie, ramcharan title merupu, ramcharan merupu, charan zangeer, ramcharan moives, nayak movie, naayak movie, zangeer stills

ramcharan latest movie title merupu

1.gif

Posted: 01/26/2013 02:25 PM IST
Ramcharan latest movie title merupu

ra

       తండ్రి మెగాస్టార్ గా ఖ్యాతి గాంచిన ప్రముఖ నటుడు. స్వభావ రిత్యా ఎప్పుడూ ఎవరినీ డైరెక్ట్ గా ఎటాక్ చేసి తూలనాడని మనస్తత్వం. అటు రాజకీయరంగంలో సైతం ఎవరెంత రెచ్చిపోయినా.. ఎవరిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సందర్భాలు బహు అరుదు. అతను చిరంజీవి.
      ఇక అతని ఒక్కగానొక్కతనయుడు  రామ్ చరణ్. సినీ రంగంలోకి అడుగిడి వెండితెరమీద కనిపించకముందే ఎంతోమంది ఫ్యాన్స్ ను వెంట ఉంచుకున్న లక్కీఫెలో.. అతని తండ్రిని గూర్చిగాని, అతని ఫ్యామిలీ.. ఫ్యాన్స్ గురించి గాని ఎవరైనా నోరెత్తితే చాలు విరుచుకుపడే తత్వం రామ్ చరణ్ ది. ఇదే అతని పాలిట ఇప్పుడు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. ఈ దమ్మును చూసే మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘నాయక్’ మూవీ విడుదలకు ముందు.. ఆ సినిమాలో సైతం ఏకంగా మీడియాపైనే దండెత్తి నా ఈక కూడా పీకలేరంటూ ఏకిపారేశాడు రామ్ చరణ్. మీడియా విపరీతపోకడలు గిట్టని మెగా ఫ్యాన్సేతరులు సైతం కుర్రాడు కత్తిలా మాట్లడాడంటూ ఆకాశానికెత్తుతున్నారు. అంతేకాదు నాయక్ ని బ్లాక్ బస్టర్ మూవీని చేసేశారు.

raa
      నాయక్ విజయానందంతో మాంచి ఊపుమీదున్న ఈ యంగ్ అండ్ డేరింగ్ హీరో తాజాగా  'మెరుపు' సినిమాతో ముందుకు రాబోతున్నాడు. దాదాపు ముప్పై ఏళ్ల క్రితం అమితాబ్ నటించిన 'జంజీర్' చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మేటి డైరెక్టర్ అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్, ప్రియాంకా చోప్రా జంటగా నటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు 'మెరుపు' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుగు విశేష్.కాం కు అందిన విశ్వసనీయ సమాచారం.
      ఇంతకుముందు చరణ్, కాజల్ జంటగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ మెరుపు టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రారంభించి, ఆదిలోనే ఆపేసిన సంగతి ఇక్కడ గమనార్హం. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మెరుపుతోనే చరణ్ ముందుకు వస్తున్నాడన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu with bollywood heroines
Varun sandesh and nisha agarwal movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles