Tollywood directors to host legend audio launch

SS Rajamouli, Srinu Vaitla, Balayya Legend audio, 14 Reels Entertainment

Tollywood top directors SS Rajamouli and Srinu Vaitla will be attended as the chief guest for this grand audio launch ceremony.

‘లెజెండ్ ’ ఆడియో గెస్టులు వీరే

Posted: 03/07/2014 07:27 PM IST
Tollywood directors to host legend audio launch

తెలుగు చిత్ర పరిశ్రమలో బాలయ్యకు ఎంత మాస్ ఫాలోయింగ్ ఉన్నదో అందరికి తెలిసిందే. అలాటి హీరో ఓ మాస్ చిత్రంలో నటించి, ఆ సినిమా ఆడియోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ దర్శకుడు గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బోయపాటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘లెజెండ్ ’ సినిమా ఆడియో ఫంక్షన్ కి టాలీవుడ్ దర్శక ధీరుడు జక్కన్న చీప్ గెస్టుగా రాబోతున్నాడు.

ఈయనతో పాటు మరో దర్శకుడు శీను వైట్ల కూడా గెస్టుగా రాబోతున్నాడు. పూర్తి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ -వారాహి చలనచిత్ర పతకాలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు, సినీ అతిరథ మహారాజులు రానున్న ఈ ఆడియో ఫంక్షన్ కి తోడు అనసూయ కూడా తోడవ్వడంతో ఈ ఆడియో అదిరిపోవడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles