Charmi satires to megastar chiranjeevi

charmi, Chiranjeevi, Megastar Chiranjeevi, Pratighatana movie, charmi satires to Megastar Chiranjeevi, political satire.

charmi satires to Megastar Chiranjeevi

చివరకు ఛార్మి కూడా చిరు పై సెటైర్లు ?

Posted: 03/19/2014 07:31 PM IST
Charmi satires to megastar chiranjeevi

మెగా స్టార్ చిరంజీవిపై  పంజాబీ పిల్ల ఛార్మి కూడా  సెటైర్లు వేసినట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అంటే ప్రత్యక్ష రాజకీయలపై ..  ఛార్మి పరోక్షంగా  సెటైర్లు వేసినట్లు తెలుస్తోంది.  ఇటీవల ఛార్మి  తమ్మారెడ్డి భరద్వాజా  ఆద్వర్యంలో  ప్రతిఘటన సినిమాలో నటించింది.  

ఆ సినిమాలో ఛార్మి ప్రాధాన పాత్ర పోషించింది.  ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాల‌ను పూర్తి చేసుకొంది. ఎలాంటి క‌ట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A ధృవీక‌ర‌ణ ప‌త్రం జారీ చేశారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు, ప్రస్తుతం మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌కు ఈ చిత్రం అద్దం ప‌డుతుంద‌ని చిత్రబృందం చెబుతోంది. 

ఛార్మి కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుంద‌ట‌. తెలుగ‌మ్మాయిని క‌థానాయిక‌గా తీసుకొందామ‌నుకొన్నా. కానీ తెలుగు మాట్లాడి, బాగా న‌టించే క‌థానాయిక ఎవ‌రూ క‌నిపించ‌లేదు. చార్మి పంజాబీ అమ్మాయి అయినా తెలుగు చ‌క్కగా మాట్లాడుతుంది. అందుకే ఆమెను ఎంచుకొన్నాం. నా ఎంపిక‌కు పూర్తిగా న్యాయం చేసింది అంటున్నారు దర్శకుడు. 

ఈ సినిమా మొత్తం  పొలిటిక‌ల్ సెటైర్లు ఉన్నట్లు ఆ చిత్ర నిర్మాత చెబుతున్నారు.  ఛార్మి నటించిన ప్రతిఘటన సినిమాలోని సెటైర్లు మెగా స్టార్ చిరంజీవి రాజకీయ జీవితానికి  దగ్గరగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.  

చిరంజీవి పై సెటైర్లు చెప్పే సమయంలో ఛార్మి చాలా ఎమోషనల్ గా చెప్పినట్లు చిత్ర దర్శకుడు అంటున్నారు. అయితే  ఛార్మి ప్రతిఘటన విడుదలైతే గానీ .. ఆ  సెటైర్లు ఏమిటో తెలుస్తోందని చిత్ర యూనిట్ సభ్యలు అంటున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles