Anchor anasuya turned as judge to kirack kiraak comedy show

anchor anasuya, anchor anasuya latest news, anasuya hot photos, anasuya hot photo shoot, anasuya kiraak comedy show, anasuya jabardast comedy show, anasuya hot photos, anasuya judge

Anchor anasuya turned as judge to kirack kiraak comedy show : telugu tv anchor anasuya now turned as judge to the kiraak comedy show which is also introduced by mallemala productions. But this show only presenting for netizens.

అనసూయ ఈ విధంగా కూడా పనికొస్తుందా..?

Posted: 08/07/2014 12:29 PM IST
Anchor anasuya turned as judge to kirack kiraak comedy show

‘‘జబర్దస్త్’’ కామెడీ షో ద్వారా బుల్లితెర ఫేమస్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న అనసూయ గురించి తెలియనివారు ఎవ్వరుండరు! ఈ అమ్మడి క్రేజ్ అటువంటిది మరీ! ఒకప్పటి బుల్లితెర యాంకర్లుగా పేరు తెచ్చుకున్న అందరినీ వెనక్కు నెట్టేసి ఈమె దూసుకుపోతోంది. ఇప్పటికీ ఎంతోమంది యాంకర్లు వున్నా... ఈమె క్రేజ్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు. టీవీ షోలలో హాట్ హాట్ డ్రెస్సులు వేసుకుంటూ మరింత అందంగా అందరినీ కనువిందు చేస్తూ అనసూయ ఓ రేంజికి ఎదిగిపోయింది. దీంతో ఈమెకున్న క్రేజ్ ను చూసి ‘‘జబర్దస్త్’’ షోని పరిచయం చేసిన మల్లెమాల ప్రొడక్షన్స్ వారు తమ ఆధ్వర్యంలో త్వరలోనే లాంచ్ చేయబోతున్న మరో కామెడీ షో ‘‘కిరాక్’’కు అనసూయను జడ్జిగా నియమించింది.

నిన్నమొన్నటివరకు టీవీ షోలలో యాంకర్ గా అలరించిన అనసూయ... ఇప్పుడు తాజాగా ‘‘కిరాక్’’ కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిబోతున్నట్టు మల్లెమాల ప్రొడక్షన్స్ వారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్ టీవీల్లో కాకుండా నెటిజన్లను దృష్టిలో పెట్టుకుని వెబ్ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఈనెల ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ కామెడీ షో స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను సిద్ధం చేసుకున్న మల్లెమాల ప్రొడక్షన్స్... ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంటర్నెట్ లో ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. ఈ షోలో అనసూయతో పాటు మరో యాంకర్ రవి కూడా జడ్జిగా కనిపించబోతున్నాడు.

ఇన్నాళ్లవరకు కేవలం యాంకర్ గా కనువిందు చేసిన అనసూయ.. ఇకనుంచి జడ్జిగా కిరాక్ తెప్పించడానికి సిద్ధం అవుతోంది. దీంతో ఈ అమ్మడి మీద కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించేశారు. నిన్నటివరకు యాంకర్ గా వున్న అనసూయ... ఈ విధంగా కూడా పనికొస్తుందా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈమె అభిమానులు మాత్రం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles