Actress sruthi hassan with bihar minister vinay in poojai movie

actress sruthi hassan, sruthi hassan latest news, sruthi hassan news, sruthi hassan bihar minister, sruthi hassan poojai movie, poojai movie, hero vishal news, hero vishal sruthi hassan

actress sruthi hassan with bihar minister vinay in poojai movie : actress sruti hassan acted with bihar minister vinay in poojai movie. vinay playing as collector role in this movie

బీహార్ మంత్రితో ఫుల్లుగా ఎంజాయ్ చేసిన శృతి!

Posted: 08/09/2014 12:56 PM IST
Actress sruthi hassan with bihar minister vinay in poojai movie

ప్రస్తుతం తెలుగు, తమిళం, బాలీవుడ్ లో దాదాపు అరడజను సినిమాలకు పైగా బిజీగా వున్న హాట్ బ్యూటీ శృతిహాసన్... మరోసారి ఒక కొత్త ర్యూమర్ తో వార్తల్లోకెక్కింది. తాజాగా శృతి, బీహార్ మంత్రితో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసిందని వార్తలు పుకార్లు చేస్తున్నాయి. దీంతో ‘‘అసలు శృతిహాసన్ బీహార్ లో ఏం చేస్తోంది... అక్కడున్న మంత్రితో ఈమెకు సంబంధం ఏంటి..?’’ అన్న ప్రశ్నలు అన్ని రంగాల్లోనూ చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు విషయం బయటపడింది.

ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా వున్న ఈ అమ్మడు.. తమిళంలో విశాల్ తో కలిసి ‘‘పూజై’’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించేందుకు యూనిట్ సభ్యులు ఇటీవలే బీహార్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ షూటింగ్ అనుమతుల విషయంలో బీహార్ రాష్ట్ర యువజన సర్వీసులు మంత్రి అయిన వినయ్.. ఈ సినిమా యూనిట్ కు ఎంతగానో సహకరించాడట..! షూటింగ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొన్ని ప్రత్యేకమైన ఏర్పాటు కూడా ఆయన చేసినట్లు యూనిట్ సభ్యులు పేర్కొంటున్నారు.

అయితే ఆ సమయంలోనే ఆ మంత్రి తాను కూడా ఆర్టిస్టేనని.. భోజ్ పురీ సినిమాల్లో నటించానని చెప్పుకున్నాడు. దీంతో ఆ చిత్రదర్శకుడు హరి మంత్రి అందించిన సేవలకు కృతజ్ఞతారూపంలో సంతోషపెట్టడానికి ఆయనకు తన సినిమాలో ఓ కీలకపాత్రను ఇచ్చాడట! దాంతో ఆ మంత్రి జిల్లా కలెక్టర్ గా వేషధారణ చేశాడట! దీంతో హర్షం వ్యక్తం చేసిన ఆ మంత్రి... దర్శకునితోపాటు చిత్రయూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలుపుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఇందులో భాగంగానే మంత్రికి, శృతికి మధ్య కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వారు షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశారని వెల్లడించిన యూనిట్ సభ్యులు.. అవి కాస్త రూమర్లుగా మారి పుకార్లు చేశాయి. అంతేకానీ.. వారి మధ్య ఎటువంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. విశాల్, శృతిహాసన్ జంటగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘‘పూజై’’ సినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో హీరో విశాల్ స్వయంగా నిర్మిస్తున్నాడు. మంచి యాక్షన్ ఎలిమెంట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం బీహార్ లో షూటింగ్ ముగించుకన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles