Tamanna bhatia png

tamanna bhatia, tamanna latest news, tamanna its entertainment, its entertainment movie review, tamanna hot photo shoot, tamanna akshay kumar, tamanna bollywood movies

tamanna bhatia its entertainment movie flop talk at the box office : tamanna bhatia latest movie its entertainment getting flop talk at bollywood box office

ఏంటి తమన్నా ఇలా చేశావ్... ఛీ?

Posted: 08/09/2014 01:23 PM IST
Tamanna bhatia png

ఒకప్పుడు ‘‘హ్యాపీడేస్’’ సినిమాతో మంచి మార్కులు కొట్టేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన తమన్నా... ఇప్పుడు తిట్లు తినిపించుకుంటోంది. ‘‘గొల్డెన్ లెగ్’’ హీరోయిన్ స్థాయి నుంచి ‘‘ఐరెన్ లెగ్’’ స్థాయికి దిగిపోయిందనే విమర్శలకు గురవుతోంది. అప్పట్లో తమన్నా అందాలకు, ఆమె నటనకు ముగ్ధులయిపోయిన దర్శకనిర్మాతలు... ఇప్పుడు ఆమె నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు తమన్నా పేరెత్తితే చాలు.. వద్దురాబాబు అంటూ భుజాలు తడుముకుంటున్నారని ఇండస్ట్రీవర్గాలు తెలుపుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలో ఈమెకు ఇప్పటికీ కాస్త ఆదరణ లభిస్తున్నా... బాలీవుడ్ లో మాత్రం ఫుల్ స్టాప్ పడేలా వుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు!

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు, తమిళంలో సినిమాలు చేసుకుంటూనే బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అక్కడ అడుగులు వేసింది. అక్కడకు వెళ్లగానే ఒక ‘‘హిమ్మత్ వాలా’’ భారీ చిత్రంలో ఆపర్ కూడా వచ్చింది. అయితే అది పెద్ద ఫ్లాప్ అవడంతో తమన్నా ఆశలు అడియాశలయ్యాయి. అయినా కూడా బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె చేరదీసుకున్నారు. దీంతో ఆమె ‘‘హమ్ షకల్స్’’ లో ఛాన్స్ కొట్టేసింది. కానీ అది అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక తట్టాబుట్టా సర్దుకుని తిరిగివస్తున్న సమయంలో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా నటించే మరో అరుదైన అవకాశాన్ని కొట్టేసింది. ‘‘అదే ఇట్స్ ఎంటర్ టైన్మైంట్’’!

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... శుక్రవారంనాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అని సినీ విశ్లేషకులు స్పష్టం చేసిపారేశారు. మూగప్రాణులకు హాని కలిగించకూడదనే సందేశాన్నిస్తూ.. కామెడీ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్లా పడిందని సినిమా విమర్శకులు తేల్చి చెప్పేశారు. బాలీవుడ్ లో వున్న సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాకు కేవలం 1, 1.5 రేటింగ్ మాత్రమే ఇచ్చారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, తమన్నా ఫర్వాలేదు కానీ... కుక్క చేసే చేష్టలను మూడుగంటలపాటు భరించాలంటే మావల్ల కాదు బాబోయ్ అని బాలీవుడ్ సమీక్షులు అసంతృప్తితో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇటువంటి చెత్త సినిమాలు ఎందుకు తీస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా.. తమన్నా బాలీవుడ్ లో నటించిన అన్నీ సినిమాలు అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ‘‘ఇట్స్ ఎంటర్ టైన్మైంట్’’ సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈమె నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో ఈమెను ‘‘ఐరెన్ లెగ్’’ అంటూ అక్కడ ముద్ర వేసేశారు. స్టార్ హీరోలతో కలిసి ఎంత భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించినా... అవన్నీ ఘోరంగా పరాజయం కావడంతో దర్శకనిర్మాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమన్నా మీద ఎన్నోఆశలు పెట్టుకుని సినిమాలు తీస్తే... ఆమె కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా తమన్నా వుండటం వల్లే ఈ సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయని, ఇకనుంచి ఆమెకు ఆఫర్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చేసినట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

మరోవైపు తమన్నా బాలీవుడ్ లో వరుసబెట్టి నటించిన సినిమాలన్నీ ఘోరంగా విఫలం కావడంతో ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏంటీ తమన్నా ఇలా చేశావ్.. ఛీ? ఇటువంటి సినిమాలు ఎందుకు ఒప్పుకున్నావు..?’’ అంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం తమన్నా బాహుబలి, ఆగడు సినిమాల్లో నటిస్తోంది. ఉత్తరాదిన లక్ కలసిరాకపోవడంతో ఇప్పుడు దక్షిణాది సినిమాలే మీదే ఎక్కువ నమ్మకాలు పెట్టుకుంది. మరి ఈ సినిమాలు ఆమెకు ఎటువంటి రిజల్ట్స్ ను అందిస్తాయో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles