(Image source from: Finally trisha saved from a big problem in her career)
ఒకప్పుడు తన మాయాజాలంతో టాలీవుడ్ లో ఒక ఊపుఊపేసిన త్రిష... కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కానీ ఆ తర్వాత రానురాను చిన్నహీరోయిన్ల హవా ఎక్కువగా కొనసాగడంతో ఆ దెబ్బతో త్రిష కొట్టుకుపోయింది. అప్పటికీ అరకొర సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ అమ్మడికి మాత్రం అదృష్టం కలిసిరాలేదు! అటు తమిళనాటలోనూ ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా పడిపోయింది. పైగా ఏజ్ ఎక్కువయిపోయిందంటూ దర్శకనిర్మాతలు ఈమెవైపు కన్నెత్తి చూడ్డం కూడా మానేశారు. దీంతో ఈ అమ్మడు దాదాపు చాన్నాళ్లపాటు ఖాళీగానే గడపాల్సి వచ్చింది. త్రిషకు అవకాశాలు అస్సలు రాకపోవడంతో ఈమె కెరీర్ ముగిసిపోయిందని అప్పట్లో తెగవార్తలు కూడా వచ్చాయి.
అయితే రానాతో ఈమెకున్న సాన్నిహిత్యం వల్ల మళ్లీ తెరపైకి వచ్చింది. పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారంటూ వీరిద్దరి మీద కథనాల మీద కథనాలు వచ్చాయి. అయితే తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ అంటూ ఆ రూమర్స్ ను కొట్టిపారేశారు కానీ.. వారిద్దరూ విచ్చలవిడిగా తిరగడాన్ని మాత్రం వదిలేయలేదు. పైగా ఈ అమ్మడి సినిమా కెరీర్ పూర్తిగా డౌన్ ఫాలో కావడంతో పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ వార్తలు షికార్లు చేశాయి. సదరు వార్తలను వారిద్దరూ ఖండించలేదు కూడా! వారి వ్యక్తిగత విషయాలను కాసేపూ పక్కనపెడితే... తాజాగా ఈ అమ్మడు ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపెడిందని తాజా సమాచారం! పూర్తిగా ప్రమాదపు అంచుల్లో మునిగిపోయిన త్రిష... ఒక్కసారిగా బయటపడటంతో తానెంతో సంతోషంగా వున్నానంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేసేస్తోంది మూడుపదుల త్రిష!
అసలు జరిగిందేమిటంటే... త్రిష కెరీర్ పూర్తిగా డౌన్ లో పడిపోయిన క్రమంలో ఈ అమ్మడికి కన్నడ నుంచి ఒక భారీ ఆఫర్ వచ్చింది. కన్నడ పవర్ స్టార పునీత్ రాజ్ సరసన ‘‘దూకుడు’’ రీమేక్ ‘‘పవర్’’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. సినిమాలో లేకుండా అల్లాడుతున్న తరుణంలో తనకు ఈ అవకాశం రావడంతో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకుంది. ఇటీవలే ఆగస్టు 28వ తేదీన ఈ మూవీ రీలీజ్ కూడా అయింది. తెలుగులో దూకుడు ఏవిధంగా అయితే సరికొత్త రికార్డులను సృష్టించిందో అదేవిధంగా కన్నడలో పవర్ మూవీ ఏ రిమార్కు లేకుండా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోందని శాండల్ వుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన త్రిష పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా వుందంటూ అక్కడి ప్రేక్షకులతోపాటు దర్శకనిర్మాతలు, ట్రేడ్ వర్గాలు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో ఈ అమ్మడి ఫుల్ ఖుషీగా వుంది.
‘‘నా కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన సమయంలో ‘‘పవర్’’ సినిమాలో నటించేందుకు ఛాన్సిచ్చిన మూవీ మేకర్స్ కు నా ధన్యవాదాలు. అలాగే నాకు అన్నివిధాలుగా సహాయంగా అందిస్తూ, సపోర్టివ్ గా పవర్ టీమ్ కు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను సక్సెస్ ఫుల్ గా స్వాగతం పలికినందుకు కన్నడ మీడియాకు, ట్రేడ్ వర్గాలకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను ఈ సినిమాలో నేను ఒక భాగస్వామురాలిని అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇది నా కెరీర్ లోనే అద్భుతమైన విజయం’’ అంటూ త్రిష చెబుతోంది. అలాగే ఈ మూవీని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ వారికి త్రిష ధన్యవాదాలు తెలుపుకుంది.
ఇదిలావుండగా.. పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన త్రిష కెరీర్ ఈ కన్నడ దూకుడుతో తిరిగి ఫుల్ స్వింగ్ లో రావడంతో ఆమె పెద్ద ప్రమాదం నుంచే బయటపడిందంటూ సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలాగే త్రిష వరుస విజయాలు సాధించుకుంటూపోతే తిరిగి తన స్టార్ డమ్ ను పొందే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రిష తెలుగులో బాలకృష్ణ సరసన ఒక చిత్రంలో నటిస్తోంది. ఆ మూవీకూడా హిట్టైతే ఇక టాలీవుడ్ లో త్రిషకు ఎదురేవుండదని చర్చించుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more