Uttej writes a prose on pawan kalyan

pawan kalyan, power star, pawan kalyan marriages, renu desai, pawan kalyan movies, latest film news, film gosips, tollywood news, uttej, telugu writers, suddala ashok teja, pawanism, uttej poem on pawan kalyan

uttej writes a prose based poet text on pawan kalyan on his birthday : uttej showed his love on pawan kalyan by writing a prose on pawar star

పవనుడికి ఉత్తేజ్ కవిత అంకితం

Posted: 09/02/2014 06:23 PM IST
Uttej writes a prose on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఆయన అభిమానులకు పండగలా మారింది. మరో వినాయక చవితిలా ముందుగా వచ్చిన దసరాలా ఈ పండగను పవనిజం భక్తులు జరుపుకున్నారు. మతం కంటే గొప్పదిగా పవనిజంను భావిస్తున్నవారంతా ఇవాళ తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలు, వేడుకలు, సేవా కార్యక్రమాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పవన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. సినిమా ప్రముఖులు కూడా పవనుడి పుట్టినరోజును మంచి రోజుగా భావించి తమ టీజర్లు, ట్రైలర్లు విడుదల చేశారు. అంత క్రేజుంది ఆ పేరుకు.., అంత పాపులారిటీ ఉందా పవర్ కు.

ఇక నటుడు ఉత్తేజ్ కూడా పవన్ కళ్యాణ్ కు తనదైన రీతిలో పుట్టిన రోజు కానుక అందించాడు. స్వతహాగా రచయిత అయిన ఉత్తేజ పవన్ కోసం ఓ కవిత రాసి పంపాడు. గుండెల్లో గూడు కట్టుకున్న మాటలను అక్షరాలుగా మలిచి అంకితం ఇచ్చాడు. ‘‘తనో ఎర్రని ఉదయం.. తనో తెల్లని ఉదయం అంటూ మొదలైన కవిత పవన్ స్వభావాన్ని తెలపటంతో పాటు ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ ను చూపించాడు. ఇక పీడిత, తాడిత గోడులు విని .. దీనుల, హీనుల గాధలు విని అంటూ ప్రజల్లో పవన్ రగిల్చిన చైతన్యాన్ని వర్ణించాడు.

చివరలో చివర్లో రాసిన ‘‘బుద్దుడు రుద్రుడైన యధార్ధమిది... హద్దుల్ని చెరిపేసిన విశ్వామిత్రుడు’’ అనే లైన్లు సమాజం పట్ల పవన్ లోని ఆవేశం, ఆవేదన, ఆలోచనను తెలిపాయి. మెరుగైన సమాజం కోసం తపిస్తున్న ఆయన మనస్సును చాటాయి. ఇలా నోటితో చెప్పలేని భావాలను మాటల్లో పలకలేని పదాలను కాగితంపై రాసి పవనుడికి అంకితమిచ్చాడు ఉత్తేజ్

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  uttej  latest news  tollywood  

Other Articles