Salman khan and jacqueline fernandez moving close to each other after their movie kick

salman khan, jacqueline fernandez, salman khan latest news, salman khan kick movies, salman khan with jacqueline fernandez, kick movie

salman khan and jacqueline fernandez moving close to each other after their movie kick : bollywood star salman khan and srilankan beauty jacqueline fernandez attending parties both together which goes viral in bollywood

సల్మాన్ కి మాంచి కిక్కిచ్చిన లంక బ్యూటీ!

Posted: 09/10/2014 03:50 PM IST
Salman khan and jacqueline fernandez moving close to each other after their movie kick

ఇటీవలే కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన మూవీ ద్వారా బాలీవుడ్ కి భారీ కలెక్షన్లతో మాంచి కిక్కిచ్చిన విషయం తెలిసిందే! దీంతో ఈ మూవీ సల్మాన్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచిపోయింది. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం తను సాధించిన ఈ విజయాన్ని ఎంజాయ్ చేయకుండా లంక బ్యూటీ వలలో పడిపోయినట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఆమె ఇచ్చిన ‘‘కిక్’’కి మనోడు ఫుల్ మత్తులో వున్నాడంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ లవర్స్ లిస్ట్ లో మరో భామ కూడా చేరిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆ అమ్మడు మరెవరో కాదు.. ‘‘కిక్’’ సినిమాలో తన కో-స్టార్, శ్రీలంకన్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్! అవును.. ఈ అమ్మడితో సల్మాన్ ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు జోరందుకున్నాయి.

‘‘కిక్’’ సినిమా విడుదల కాకముందు సల్మాన్, జాక్వెలిన్ ఇద్దరూ కలిసి ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా చాలా ప్రాంతాలను చక్కర్లు కొట్టారు. క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా వుండిపోయారు. ఇక సినిమా రిలీజ్ అయింది... భారీ హిట్ సాధించింది... దాంతో మళ్లీ వీరిద్దరూ తమ సక్సెస్ ఫుల్ పార్టీని కంటిన్యూ చేశారు. మూవీ భారీ కలెక్షన్లను సాధించిందనే సంతోషంలో ఇద్దరూ కొన్నాళ్లవరకు పార్టీలకు, పబ్బులకంటూ బాగానే తిరిగారు. దీంతో వీరిమధ్య సాన్నిహిత్యం బాగానే పెరిగిందని అందరూ గుసగులాడుకున్నారు. ఈ వ్యవహారమంతా సినిమా విడుదలకు ముందు, విడుదలైన కొన్నిరోజులవరకు బాగానే నడిచింది. అయితే సినిమా విడుదలై ఇప్పటికి చాలా రోజులయ్యింది.. అయినప్పటికీ వీరిద్దరూ అడ్డూఅదుపు లేకుండా.. సమయంతో తమకేమీ సంబంధం లేనట్టు రాత్రింబవళ్లు పార్టీలకు షికార్లు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

ఇటీవల సల్మాన్ ఖాన్ తన స్నేహితుడి ఇంట్లో పార్టీ వుందని వెళ్లాడు. అయితే అతనితోపాటు జాక్వెలిన్ ను కూడా తోడుగా తీసుకెళ్లాడట! దీంతో చాలా సాన్నిహిత్యంగా వున్న ఇద్దర్నీ చూసిన సల్మాన్ స్నేహితుడు ఒక్కసారిగా షాక్ తిన్నాడట! వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఇంత గట్టిగా ఎలా ఏర్పడిందంటూ సందేహాలను వ్యక్తం చేసుకున్నాడట! ఇది చూసిన అతను.. సల్మాన్ ఖాన్ లవర్స్ జాబితాలో మరొక అమ్మాయి చేరిపోయిందంటూ అనుకున్నాడట! అంటే.. సల్మాన్ ఖాన్ మరొక భామను తన వలలో వేసుకున్నాడంటూ ఒక్కటే వార్తలు వస్తున్నాయి. మరి వీరిమధ్య వున్న ఈ బంధం ఎక్కడిదాకా వెళుతుందో.. ఎన్నాళ్లవరకు వుంటుందో.. వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  jacqueline fernandez  kick movie  bollywood media  

Other Articles