Ram charan tej to act with samantha in his next movie

govindudu andarivadele, govindudu andarivadele audio, govindudu andarivadele audio release, govindudu andarivadele songs free download, govindudu andarivadele latest updates, govindudu andarivadele shooting photos, govindudu andarivadele ramcharan, govindudu andarivadele ram charan byke, latest news, tollywood, ram charan tej, ram charan tej next movies, ram charan tej latest, samantha, samantha movies, samantha latest, samantha with ram charan

young power star ram charan tej to act with bubby samantha in his next movie : samantha dream will comes true as she is going to act with ram charan tej in his upcoming movie

చెర్రితో కోరిక తీర్చుకుంటున్న సమంత

Posted: 09/21/2014 11:37 AM IST
Ram charan tej to act with samantha in his next movie

జెస్సి భామ కోరిక తీరబోతుంది. ఇంతకాలం అడ్డుపడ్డ రాహుకాలం తొలగటంతో ఎగిరి గంతేస్తోంది. ఎప్పుడెప్పుడు చిరుతతో కలిసి స్టెప్పులేస్తానా అని ఎదురుచూస్తోంది. ఇందుకు కారణం త్వరలోనే రామ్ చరణ్ సమంతతో కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కృష్ణవంశీ క్రియేటివిటీ, చరణ్ యాక్టింగ్ పై ఫ్యాన్స్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే ఆడియో, ట్రైలర్స్ ఫ్యాన్స్ కు బాగా దగ్గరయ్యాయి.

ప్రస్తుతం యంగ్ పవర్ స్టార్ మరో సినిమాలో నటించేందుకు సిద్దంగా ఉన్నాడు. అయితే ఈ వివరాలు మాత్రం బయటకు తెలియనివ్వటం లేదు. కాని ఒక్క విషయం బయటకు లీక్ అయింది. అదేమంటే రామ్ చరణ్ తో కలిసి సమంత ఈ సినిమాలో నటిస్తుందని. ఎవరూ దృవీకరించకపోయినా.. చెక్కిన ముక్కుతో కొత్త వన్నె తెచ్చుకున్న ముద్దుగుమ్మ చాన్స్ కొట్టేసిందని సన్నిహితులు అంటున్నారు. అటు సమంత కూడా ఓకే చెప్పేసిందట. ప్రస్తుతం అమ్మడు చెర్రి కోసం డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

సమంత గురించి మరో విషయం ఏమిటంటే.., రామ్ చరణ్ తేజ్ తో నటించాలని ఎప్పటినుంచి తహతహలాడుతోంది. ఒక్కసారైనా చిరు తనయుడితో కలిసి కన్పించాలనుందని గతంలో చెప్పింది కూడా. అయితే ఆమెకున్న డిమాండు.., దర్శకుల అవసరం కారణంగా అందర్ని సంతృప్తి పరిచే వరకు చాలా సమయమే పట్టింది. ఇప్పటికి గ్రహణాలు తొలగి శుభగడియలు వచ్చినట్లుగా.., ఇద్దరి కలయికతో సినిమా ఓకే అయింది. కోరుకున్న కొత్త కాంబినేషన్ ఎలా క్రేజ్ సంపాదిస్తుందో చూడాలి. చివరగా చెప్పాల్సింది ఏమిటంటే.. చరణ్ తో నటించాలన్న కోరిక తీరుతున్నా.., సొమ్ము తీసుకోవటంలో తగ్గే ప్రసక్తే లేదని చెప్తోందట. అంటే పేకాట పేకాటే.., బావ మరిది బావమరిదే అన్నట్లు సమంత లెక్క.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  samantha  govindudu andarivadele  latest news  

Other Articles