Akkineni akhil entry after oka laila kosam hit

akkineni akhil, akkineni akhil movie, akkineni akhil entry, akkineni akhil film, naga chaitanya, naga chaitanya wiki, manam movie, oka laila kosam, oka laila kosam release, nagarjuna, nagarjuna movies, meelo evaru kotiswarudu, latest news, tollywood

akkineni akhil reveals his entry into films with great hit of his brother's oka laila kosam movie : i will enter into films after a super hit of my brothers oka laila kosam movie says akhil akkineni on saturday

వదిన ఓకే అంటే సినిమాల్లోకి వచ్చేస్తా..

Posted: 09/21/2014 12:39 PM IST
Akkineni akhil entry after oka laila kosam hit

అక్కినేని అఖిల్ తెరంగేట్రంపై చిక్కుముడి ఒకటి పెట్టాడు. అదేమంటే తన వదిన ఓకే అంటే సినిమాల్లోకి వస్తానని చెప్తున్నాడు. ప్రస్తుతం అన్న నాగచైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమా విడుదల కోసం ముస్తాబవుతోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయి లైలా ఓకే అని ఫ్యాన్స్ చెప్తే తాను సినిమాల్లోకి వస్తానని చెప్తున్నాడు. తన ఫ్యామిలికి ఒక హిట్ పడాలని కోరుకుంటున్నా.., అది రాగానే రంగ ప్రవేశం ఖాయమని ప్రకటించాడు అఖిలుడు. ఇక రీ ఎంట్రీ గురించి ఏపీ రాజధాని విజయవాడలోనే చెప్తానని ప్రకటించేశాడు.

మనం 100రోజుల కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అఖిల్ సినిమాలపై మాట్లాడారు. నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’లో నటించే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇలాంటి కధలో తనను తీసుకుని చోటు కల్పించినందుకు డైరెక్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాడు. త్వరలోనే తన సినిమా ప్రవేశం ఉంటుందని చెప్పాడు. అయితే డైరెక్టర్ ఎవరు, కధ ఏమిటి ఇలాంటి విషయాలను మాత్రం వెల్లడించలేదు.

శనివారం సాయంత్రం జరిగిన ‘మనం’ 100 రోజుల కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇదే వేదికపై ‘ఒక లైలా కోసం’ ఆడియో హిట్ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో అనుకున్న సినిమా విడుదల చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంకు వాయిదా పడినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తరుచుగా వాయిదా పడుతుండటంపై అక్కినేని ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  akkineni akhil  latest news  tollywood  

Other Articles