Akkineni award 2013 to amitabh bachchan

akkineni, akkineni nagashwar rao, akkineni nageswar rao, manam movie, akkineni family, akkineni photos, akkineni nageswar rao wiki, akkineni amala, akkineni naga chaitanya, naga chaitanya movies, akkineni akhil, akkineni award 2013, akkineni award, amitabh bachchan, amitabh bachchan movies, amitabh bachchan family, amitabh bachchan wiki, amitabh bachchan latest news, big b, latest news, tollywood, bollywood

akkineni national award 2013 is going to give amitabh bachchan on soon days announced by t subbirami reddy : amitabh bachchan to take akkineni national award 2013 for his service to films

అమితాబ్ ను వరించిన అక్కినేని

Posted: 09/21/2014 01:07 PM IST
Akkineni award 2013 to amitabh bachchan

బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో గౌరవం దక్కించుకున్నారు. ప్రతి ఏటా ఇస్తున్న అక్కినేని జాతీయ అవార్డు ఆయనను వరించింది. 2013 సంవత్సరానికి గాను ఈ అవార్డును అమితాబ్ కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ఈ పురస్కారం కింద రూ.5లక్షల నగదుతో పాటు.., ప్రశంసాపత్రం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంతో త్వరలో శిల్పకళావేదికలోనే జరుగుతుందని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. 2005 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఈ అవార్డును సిని రంగంలో విశేషంగా కృషి చేసిన వారికి అందజేస్తున్నారు.

ప్రతి సంవత్సరం ప్రారంభంలో అవార్డును ఇచ్చేవారు. అయితే ఈ సారి అక్కినేని నాగేశ్వర రావు మరణంతో అవార్డు ఎంపికలో కాస్త జాప్యం జరిగినట్లు అవార్డు కమిటీ చైర్మన్ వెల్లడించారు. ఇకపై వచ్చే ఏడాది నుంచి ఈ అవార్డును అక్కినేని నాగేశ్వ రరావు జయంతి అయిన సెప్టెంబర్ 20న అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఈ అవార్డును షబానా అజ్మి, అంజలీదేవి, దేవానంద్, వైజయంతి మాలా, లతా మంగేష్కర్, హేమా మాలిని, శ్యాం బెనగల్, బాలచందర్ సహా ఇతర ప్రముఖులు అందుకున్నవారిలో ఉన్నారు.

కార్తిక్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  latest news  akkineni award  tollywood  

Other Articles