ట్రై యాంగిల్ లవ్ స్టోరిలు సినిమాల్లో చాలానే చూశాము.., నిజ జీవితంలో కూడా అక్కడక్కడా ఇవి జరుగుతున్నాయి. ఈ త్రికోణం ప్రేమ అంటే అమ్మాయి లేదా అబ్బాయి ఒకరిని లవ్ చేస్తుంటే., వారిని కొత్తగా మూడవ వ్యక్తి ప్రేమించటం. ఇప్పుడిది డేటింగ్ లో కూడా జరుగుతోందండీ బాబు. అదీ మన దేశంలోనే.., డేటింగులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాలీవుడ్ లో ఈ వింత కల్చర్ పుట్టుకొస్తోంది. ఇద్దరు హీరోయిన్లు.., ఒక హీరోతో డేట్ చేస్తున్నారట. తాజాగా దీపికా పడుకునే చెప్పిన మాటలతో ఈ విచిత్రం బయటకు వచ్చింది.
బాలీవుడ్ లో దీపికా పడుకునే డేటింగ్ గురించి చాలామందికి తెలుసు. దీపిక రణ్ వీర్ డేట్ లో ఉన్నారని... తెగ ప్రచారం జరిగింది. ఇప్పుడీ విషయాన్ని దీపిక స్వయంగా ప్రకటించింది. కూడా. రణవీర్ తో డేటింగ్ పై తనను ప్రశ్నించిన ఓ జర్నలిస్టుకు..‘‘డేటింగ్ కు సరైన వ్యక్తి రణ్ వీర్.. ఇక అంతకంటే ఏమి చెప్పను’’ అని చెప్పేసిందట. ఇంకేముంది ఇద్దరి మద్యా డేటింగ్ ఉందహో... అంటూ బాలీవుడ్ అంతా ప్రచారం జరుగుతోంది. అనుకున్నదే నిజం అయింది అని బాలీవుడ్ విశ్లేషకులు చంకలుకొట్టుకుంటున్నారు. డేటింగ్ విషయాన్ని రణ్ వీర్ తోసిపుచ్చలేదు. అలాగని వ్యతిరేకించలేదు కూడా. దీంతో ఇద్దరిమద్య ఖచ్చితంగా సమ్ థింగ్.., సమ్ థింగ్ అని ప్రచారం జరుగుతోంది.
మనది కాని డేటింగ్ కల్చర్ ను బాగానే ఫాలో అవుతున్నారు.. బాగానే ఉంది. కాని ఇక్కడే మరో విషయం మనం గుర్తు చేసుకోవాలి. అదే బాలీవుడ్ బ్యూటి ప్రియాంక చోప్రా.., రణ్ వీర్ డేటింగ్. వీరిద్దరి డేట్ల గురించి కూడా తెగ ప్రచారం జరిగింది. ‘గుండె’ సినిమాలో కలిసి నటించిన ఇద్దరూ... గుండెల నిండా డేటింగ్ నింపుకుని ఉన్నారని పుకార్లు వచ్చాయి. మరి ఈ వ్యవహారంలో ఏమిటో., ఇఫ్పుడు ఉందో.., లేదో తెలియదు. ప్రియాంక -రణ్ వీర్ డేటింగ్ నిజం అయితే.., అటు దీపిక- రణ్ వీర్ డేటింగ్ కూడా నిజమని పొడుగు కాళ్ళ సుందరి ప్రకటించింది. ఏంటో ఏమనాలో తెలియకుండా ఉంది వీరిని.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more