టాలీవుడ్ ఛార్మింగ్ గాళ్ ఛార్మికి ఇన్నాళ్లవరకు సినిమాలు లేకపోవడం వల్ల ఖాళీగా కాలయాపన చేసిన విషయం తెలిసిందే! సినిమా అవకాశాల కోసం ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ లో ఎన్ని చక్కర్లు కొట్టినప్పటికీ.. ఈమెకు మాత్రం ఆఫర్లు వరించలేదు. అయితే అప్పుడప్పుడు ఐటెంసాంగ్ లలో కనువిందు చేసి ప్రేక్షకులను బాగానే అలరించింది. రెండు, మూడు చిన్న సినిమాల్లో కూడా నటించింది. కానీ ఆ సినిమాలు కూడా బోల్తా పడిపోవడంతో చిన్న చిత్రాల నిర్మాతలు కూడా ఆమెను పక్కన పెట్టేశారు. దీంతో వచ్చిన ప్రతిసారి ఆఫర్లను వదులుకోకుండా ఐటెం సాంగ్ లు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఒకప్పుడు ‘‘మంత్ర’’ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు టాలీవుడ్ లో ప్రాణం పోసిన ఛార్మి... వరుసగా పరాజయాలు చవిచూడటంతో నేడు ఖాళీగా వుండిపోయింది.
ఇదిలావుండగా.. ఖాళీగా వున్న సమయంలో ఛార్మి ఎవరో బిజినెస్ మేన్ ని ప్రేమించిందని.. అతనితో త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే పుకార్లు బాగానే షికార్లు చేశాయి. కానీ అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనంటూ ఛార్మి కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు తాజాగా ఈ అమ్మడికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ ముహూర్తం కుదిరింది ఆమె పెళ్లి విషయంలో కాదులెండి... ఎన్నాళ్లనుంచో వెయిట్ చేస్తున్న ‘‘మంత్ర 2’’ మూవీకి ముహూర్తం ఖరారు అయినట్లు స్వయంగా ఛార్మీనే స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఆ మూవీ నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని ఆమెతోపాటు దర్శకనిర్మాతలు కూడా పేర్కొంటున్నారు. ఎస్.వి.సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె.ఏ.రవికుమార్ రెడ్డి సమర్పణలో వి.యాదగిరిరెడ్డి, బోనాల శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తన మూవీ గురించి ఛార్మి మాట్లాడుతూ.. ‘‘దాదాపు ఏడేళ్ల క్రితం చేసిన ‘మంత్ర’ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మళ్లీ అలాంటి సినిమా చేయమని చాలామంది అడుగుతున్నారు. కానీ సమయం లేకపోవడం వల్ల వీలు కుదరలేదు. కానీ ఇన్నాళ్లకు తిరిగి ‘‘మంత్ర 2’’ తీయడానికి వీలు కుదిరింది’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఛార్మీ అందించిన సహకారం మరువలేనిది. 20 రోజులపాటు ఏకధాటిగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు షూటింగ్ లో ఆమె పాల్గొంటోంది. సంగీత దర్శకుడు చక్రి ఈ తరహా సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ చేయడం ఇదే మొదటిసారి’’ అని చెప్పారు. అలాగే దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఈ తరహా చిత్రం ఎప్పటికీ రాలేదు’’ అని ఆయన అన్నారు. ‘‘మంత్ర 2’’ సినిమాతో ఛార్మి తిరిగి లైమ్ లైట్ లోకి రావడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more