Ileana dcruz australian photographer andrew marriage in january 2015

ileana dcruz, ileana latest news, ileana boyfriend, ileana marriage news, ileana with andrew marriage, ileana andrew photos, ileana bollywood movie, bollywood news, tollywood news, telugu news

ileana dcruz australian photographer andrew marriage in january 2015 according to the bollywood source

ప్రొడ్యూసర్లతో ఇలియానా కమిట్ మెంట్స్ క్రాష్!

Posted: 09/29/2014 01:14 PM IST
Ileana dcruz australian photographer andrew marriage in january 2015

ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ఇలియానా.. అదే టాలీవుడ్ పై తిట్లదండకం సంధించి బాలీవుడ్ కి చెక్కేసిన విషయం తెలిసిందే! మొదట సినిమా అవకాశాల కోసం దర్శకినిర్మాతలను ఆకాశానికెత్తేసి డేట్స్ కోసం వెంపర్లాడిన ఈ సన్నజాజి నడుము పిల్ల... కొంచెం స్టార్ డమ్ వచ్చిన తర్వాత ఇక్కడ చేరదీసిన ప్రొడ్యూసర్లకు పెద్ద షాకిచ్చేసి హిందీ చలనచిత్ర ప్రపంచంలోకి దూరిపోయింది. అక్కడ కూడా ఇదే వరుసను కొనసాగించింది. మొదట్లో మూవీ ఆఫర్లకోసం తన వయ్యారాలతో అక్కడి నిర్మాతలు తన వలలో పడేసిన ఈ గోవా బ్యూటీ... ఇప్పుడు తాజాగా వారితో చేసుకున్న కమిట్ మెంట్స్ అన్ని క్రాష్ చేసినట్లు బాలీవుడ్ నుంచి వెలువడుతున్న సమాచారం! దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో ప్రస్తుతం అంగీకరించిన సినిమాలు మాత్రమే చేస్తూ.. ఇంకా సెట్స్ కు వెళ్లకముందే ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేసేసిందని వార్తాసారంశం!

అసలు విషయం ఏమిటంటే.. ఈ గోవా బ్యూటీ ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే! గత కొన్నాళ్లనుంచి చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు. అయితే తాజాగా బాలీవుడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారాల ప్రకారం.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఆండ్రూను పెళ్లి చేసుకోవడానికి ఇలియానా తన ఫ్యామిలీ మెంబర్స్ ను ఒప్పించిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 2015 జనవరిలోనే ఇలియానా పెళ్లి జరగవచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇల్లీ కొత్త సినిమా ప్రాజెక్ట్స్ ఒప్పుకోకుండా ప్రస్తుతం చేస్తున్న సినిమాలను మాత్రమే త్వరగా పూర్టి చేసుకోవాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles