Govindudu andarivadele movie targeted attarintiki daredi movie records

govindudu andari vadele movie, ram charan news, ram charan latest news, govindudu andari vadele attarintiki daredi movie news, pawan kalyan latest news, producer bandla ganesh news, ram charan pawan kalyan, ram charan govindudu andari vadele movie, pawan kalyan attarintiki daredi movie

govindudu andarivadele movie targeted attarintiki daredi movie records

పవర్ స్టార్ ని టార్గెట్ చేసిన గోవిందుడు! ఏడ్చేసిన నిర్మాత!

Posted: 09/29/2014 01:57 PM IST
Govindudu andarivadele movie targeted attarintiki daredi movie records

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమా టాలీవుడ్ లో ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే! విడుదలకు ముందే ఆ మూవీ పైరసీ వచ్చినప్పటికీ కూడా పవన్ మేనియాతో ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. దీంతో ఈ సినిమాను టార్గెట్ చేసుకుని ఆ రికార్డులను బద్దలు కొట్టేందుకు ఇప్పటికే చాలామంది ప్రయత్నించారు కానీ... అది సాధ్యపడలేదు. అయితే రామ్ చరణ్ హీరోగా తాజాగా వస్తున్న ‘‘గోవిందుడు అందరివాడేలే’’ మూవీ పవన్ రికార్డులను ఖచ్చితంగా బద్దలు కొడుతుందని ఆ మూవీ యూనిట్ వర్గాలతోపాటు ట్రేడ్ వర్గాలు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఎందుకంటే.. ఇటీవలే విడుదలైన ‘‘గోవిందుడు..’’ ఫస్ట్ లుక్, టీజర్లను అభిమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతోపాటు బిజినెస్ పరంగా భారీ క్రేజును సొంతం చేసుకుంది. తెలుగించి వాతావరణాన్ని అద్దం పట్టే ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతున్న కారణంతో ఈ సినిమా భారీగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో బయ్యర్లు కూడా దీనిపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగే పండుగ సీజన్ కూడా కలిసి రావడంతో ఇప్పటికే నిర్మాత బండ్లగణేష్ అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను రికార్డు ధరకు అమ్మినట్లు తెలుస్తోంది. ఆంధ్రా, నైజామ్, సీడెడ్, ఓవర్సీస్.. ఇలా అన్ని చోట్లా భారీ బిజినెస్ చేసుకున్నొ ఈ మూవీ.. విడుదలకు ముందే సేఫ్ ప్రాజెక్ట్ అయినట్లు వర్గాలు తెలుపుతున్నాయి. వీటితోపాటు జెమిని టీవీ 8.5 కోట్ల రూపాయలు వెచ్చించి శాటిలైట్ హక్కుల్ని కూడా సొంతం చేస్టున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. ఇంకా రిలీజ్ కాకముందే మంచి లాభాలను రాబట్టుకున్న ఈ మూవీ.. విడుదల తర్వాత టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇదిలావుండగా.. ‘‘గోవిందుడు..’’ మూవీ నిర్మాత బండ్లగణేష్ కూడా అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తొలికాపీని చూసిన తాను ఏడుపొచ్చిందని పేర్కొన్న ఆయన.. ఈ సినిమా తన కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంత ఎమోషన్ చూసిన తాను సాధారణంగా కన్నీరు పెట్టనని, కానీ ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం వాటిని ఆపుకోలేకపోయానని బండ్ల అన్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత టాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఆయన పూర్తి విశ్వాసాన్ని వెలిబుచ్చారు. మరి పవర్ స్టార్ ను టార్గెట్ చేసిన గోవిందుడు... అంచనాలకు తగ్గట్టుగానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలంటే.. మరికొన్ని రోజులవరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles