‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 1న తెల్లవారుజామున విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. సినిమాపై అభిమానులు అయితే భారీ అంచనాలే పెట్టుకున్నారు. రామ్ చరణ్ పవర్ కాజల్ అగర్వాల్ గ్లామర్.., కృష్ణవంశీ క్రియేషన్ దీనికి తోడు బండ్ల గణేష్ భారీ బడ్జెట్. ఇన్ని హైలైట్స్ తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా మెగా ఫ్యామిలికి దసరా పండగను అందిస్తుందని అనుకుంటున్నారు. అటు అభినులు కూడా తమకు రెండ్రోజుల ముందే దసరా వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఈ సినిమా హిట్ అవుతుందా లేక చిరు ‘అందరివాడు’లా నిరాశపరుస్తుందా తెలియాలంటే ఓ రోజు ఆగాల్సిందే.
ఫ్యామిలి సినిమాలు, బంధాలు-కుటుంబ అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సినిమాను కూడా అదే పంధాలో తీసినట్లు తెలుస్తోంది. ఓ మంచి ఫ్యామిలి ఎంటర్ టైన్ మెంట్ సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఆయన ఆరాటం ఈ సినిమాతో తీరుతోంది. చాలాకాలంగా తెలుగు ఇండస్ర్టీలో ఫ్యామిలి ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. అప్పట్లో వచ్చిన నిన్నే పెళ్లాడతా.., కలిసుందాం రా.. నువ్వు నాకు నచ్చావ్ వంటి సినిమాలు ఇప్పుడు రావటం లేదు. ఆ సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.., కాబట్టి కుటుంబ సంబంధ కధలను ఎక్కువగా ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నారు.
ఇక ‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ కు ఆ స్థాయి హిట్ తగల్లేదు. ‘రచ్చ’ ‘ఎవడు’ విజయవంతం అయినా.., అది కాలబైరవుడి రికార్డులను తిరగరాయలేకపోయింది. దీంతో ఇప్పుడీ ఫ్యామిలి కధపై ఆశలు పెట్టుకుని క్రియేటివ్ మాయపై నమ్మకంగా ఉన్నాడు. గోవిందుడు అందరివాడేలే పాటలకు కూడా మంచి స్పందనే వస్తోంది. దీంతో సినిమా కూడా హిట్ అవుతుందని కోటి ఆశలతో ఉన్నాడు. అటు ఈ మద్య విడుదలైన ‘పవర్’ కాస్త తగ్గిపోగా ‘ఆగడు’ గురించి అయితే చెప్పనవసరంల లేదు. ఇక లౌక్యం ఉన్నప్పటికి అంత కాంపిటేషన్ కాదు. దీంతో దసరా సీజన్ లో రేసులో ఉన్నది ఈ ఒక్క సినిమానే. సరిగ్గా సెలవులు, అంతా ఇళ్ళలో ఉండే టైం చూసుకుని మరీ టార్గెట్ చేసి విడుదల చేస్తున్నారు చరణ్ అంచనాలు ఏమవుతాయో మరి చూడాలి. ఇక ‘మగధీర’, ‘ఎవడు’ హిట్ల కాంబినేషన్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హ్యాట్రిక్ కొడుతుందా.., లేక అలా తేలిపోతుందా అనేది తేలనుంది.
బండ్ల గణేష్ విషయానికి వస్తే సినిమాపై ఆయనకున్న పట్టుదల ఎవరికి లేదు అన్నట్లు కన్పిస్తోంది. ఖచ్చితంగా అక్టోబర్ 1న సినిమా విడుదల అవుతుందని ప్రకటించిన బండ్ల.., అందుకోసం నానా హడావుడి చేశాడు. ఇచ్చిన మాట కోసం చాలా కష్టపడ్డాడు. గణేష్ పై నమ్మకంతోనే చెర్రి ఫ్యాన్స్ అక్టోబర్ 1 ఉదయం 5.18కి తొలి షో అని ప్రకటించేసుకున్నారు. భారీ బడ్జెట్ తో ఫారిన్ లో షూట్ చేసిన ఓ పాట ఎడిటింగ్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవుతుందని ఏకంగా ఆ పాటనే సినిమాలోంచి తీసేయమన్నాడు. ఇందుకోసం హీరో, డైరెక్టర్, ఇతర వర్గాలను ఒప్పించాడు. అంతగా కావాలంటే విడుదల అయ్యాక మళ్లీ యాడ్ చేసి చూపిద్దాం అని అన్నాడు. ఇందులో ఇచ్చిన మాటకు కట్టుబడాలన్న తపనతో పాటు మరో కోణం కూడా దాగి ఉంది. అదేమంటే... విడుదల అయిన తర్వాత సినిమాకు అదనంగా పాటను కలిపితే దాన్ని చూసేందుకు ప్రేక్షకులు మరోసారి థియేటర్ కు వస్తారన్నమాట. అంటే కలెక్షన్ థాట్ కూడా దీంట్లో యాడ్ అయిందన్న మాట. మరి గణేష్ ఆశలు సజీవంగా ఉంటాయా.. లేక భారీ బడ్జెట్ చేతులు కాలుస్తుందా అని అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం రావాలంటే అక్టోబర్ 1 2014 ఉదయం తొలి షో విడుదల కావాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more