Actress colors swathi posted a poetry on facebook about her personal life and gossips

colors swathi, actress swathi, colors swathi facebook, colors swathi hot photos, colors swathi movies, colors swathi twitter account, colors swathi rare photos, colors swathi affairs

actress colors swathi posted a poetry on facebook about her personal life and gossips

అబ్బ... అది అంటే చాలా నాటీ ఫెలో!

Posted: 09/29/2014 06:32 PM IST
Actress colors swathi posted a poetry on facebook about her personal life and gossips

తమళ్, తెలుగులో సినిమాలు చేస్తున్నప్పటికీ గత కొన్నిరోజుల వరకు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా వున్న కలర్స్ స్వాతి.. తాజాగా ఒక సెన్సేషనల్ స్టేట్ మెంట్ వార్తల్లోకెక్కేసింది. తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన అంశాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి.. అందరినీ షాక్ కు గురిచేసింది. ఇంతవరకు తన పర్సనల్ లైఫ్ గురించి ఏ ఒక్క కామెంట్ చేయకుండా మీడియాను దూరంగా వుంచిన ఈ అమ్మడు... సడెన్ గా ఇలా సోషల్ వెబ్ సైట్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఇంతకు ఆమె ఏం చెప్పిందనేగా మీ సందేహం.. అది తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇటీవల ఈ అమ్మడి వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వచ్చిన సంగతి అందిరికీ తెలిసిందే! ఈ అమ్మడు ఎవరితోనో సీక్రెట్ గా డేటింగ్ చేస్తోందని.. అతనితో రాత్రింబవళ్లు చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని.. త్వరలో అతనితో పెళ్లి కూడా చేసుకోబోతోందనే వార్తలు బాగానే షికార్లు చేశాయి. ఈ విషయంపై మీద ఆమె ఫేస్ బుక్ లో తన బాధను కవిత్వ రూపంలో పోస్ట్ చేసింది. ‘‘ట్రూత్ ఈజ్ నాటీ ఫెలో! కొన్నింటిని నమ్మకూడదు. నమ్మేవాడు నిజమైన స్నేహితుడు కాడు’’ అంటూ సుదీర్ఘమైన పోయెత్రీ రాసింది. ఇక్కడ ఆమె చెబుతున్న విషయం ఏమిటంటే.. తనను అపార్థం చేసుకునేవారు ఎవరైనా సరే.. వారికి హింస ఇలాగే వుంటుదని చెప్పకనే చెబుతోంది!

అలాగే ‘‘కొన్ని కళ్లు నీలోని బలహీనతనే చూస్తాయి. ఆ పెదాలు ఎప్పుడూ చెత్తగానే వాగుతాయి. పెద్దపెద్ద రెక్కలు విచ్చుకుని ఇలాంటి వాటిని చేరవేయాలని ఉత్సాహంతో తెగ ఎగిరేస్తుంటారు. అయితే నిజం ఏంటో..? అబద్ధం ఏంటో..? తెలుసుకుని స్వయం ప్రకాశకులు కావాలి. అంతేగానీ.. ఏదిబడితే అది నమ్మేయకూడదు’’ అంటూ అందరికీ పెద్ద క్లాసే పీకేసింది. మొత్తానికి తాను చెప్పదలచుకున్నదేంటంటే.. తాను ఏ ఒక్కరితోనూ ఎఫైర్ నడపడం లేదని, తనమీదే వచ్చే గాసిప్స్ ను నమ్మకండి అంటూ బాధగా చెప్పుకుందన్నమాట! మరి ఇక్కడినుంచైనా ఈ అమ్మడి మీద గాసిప్స్ రావడం ఆగుతాయా..? లేక పెరుగుతాయా..? అనేది వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles