Dhanush velai illa pattathari to be dubbed into telugu with raghuram be name

dhanush next movie, dhanush latest song, dhanush song in kannada movie, dhanush Velai illa Pattathari movie, Velai illa Pattathari movie latest updates, Velai illa Pattathari movie in telugu, hero ram, latest tollywood updates, raghuram b.e. movie, raghuram b.e. movie updates, telugu dubbing movies

dhanush Velai illa Pattathari to be dubbed into telugu with raghuram be name : tamil popular hero dhanush latest hit movie velai illa pathahari movie to be dubbed into telugu with raghuram b t name this movie got big hit in koliwood hero ram tried to remake in telugu but finally with some reasons remake proposal not came forward

తమిళ స్వయంకృషి రీమేక్ రావట్లేదు

Posted: 10/18/2014 11:03 AM IST
Dhanush velai illa pattathari to be dubbed into telugu with raghuram be name

తమిళంలో భారీ హిట్ సాధించిన ధనష్ సినిమా ‘వేలయిళ్ల పట్టితారి (వి.ఐ.పి)’ తెలుగు రీమేక్ పై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ఈ సినిమాను రీమేక్ చేయటం లేదని స్పష్టం అయింది. తిరిగి తెరకెక్కించే బదులుగా... డబ్బింగ్ చేసి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. తెలుగులో ‘రఘురామ్ బి.ఈ.’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఇంజనీరింగ్ పూర్తయిన ఓ అబ్బాయి ఉద్యోగం చేయకుండా.., కష్టపడి స్వయంకృషితో ఎలా ఇంజనీర్ అయ్యాడు అనేది కధ. ఇందులో ధనుష్ నటన అద్భుతంగా ఉంది అని అంతా కితాబిచ్చారు. అమలాపాల్ హీరోయిన్ గా నటించగా.., అనిరుధ్ సంగీతం అందించాడు.

కోలీవుడ్ లో హిట్ అయిన ఈ సినిమాను టాలీవుడ్ లో హీరో రామ్ రీమేక్ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే పలు కారణాల వల్ల ఈ ప్రతిపాదన పట్టాలెక్కటం లేదు అని తెలిసింది. రీమేక్ బదులుగా డబ్బింగ్ చేసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. త్వరలోనే డబ్బింగ్ హక్కుల కొనుగోలుదారులు.., ‘రఘురామ్ బి.ఈ.’ సినిమా విడుదల తేది ఇతర వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram b.e.  dhanush  velai illa pattahari  dubbing  

Other Articles