Ram charan to act in trivikram and bandla ganesh movie soon

ram charan teja next movie news, ram charan movie with trivikram, ram charan movie with bandla ganesh, trivikram allu arjun movie latest news, tollywood latest gossips, telugu upcoming movies, bandla ganesh trivikram movies,

ram charan to act in trivikram and bandla ganesh movie soon : producer bandla ganesh says on trivikram birthday that he and director going to make a movie with ram charan tej soon. tollywood rumors that trivikram to direct a movie with ram charan tej in bandla ganesh production

చెర్రి నోటితో మంత్రాలు చెప్పిస్తానంటున్న గణేషుడు

Posted: 11/07/2014 06:55 PM IST
Ram charan to act in trivikram and bandla ganesh movie soon

డేరింగ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ శుక్రవారం రోజు ఓ ప్రకటన చేశాడు. ట్విట్టర్ అకౌంట్ లో ఆయన చేసిన పోస్టింగ్ రామ్ చరణ్ అభిమాలను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేయటంతో పాటు, ఆనందాన్ని కూడా అందించింది. అదేమంటే.. త్వరలోనే రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పాడు. అదికూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి చేస్తున్నాము అని సంకేతాలు ఇచ్చాడు. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా ట్విట్టర్ లో గణేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమాపై మరో పోస్ట్ చేశాడు.

గణేష్ పోస్ట్ తో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మాటల మాంత్రికుడితో సినిమా అంటే సూపర్ హిట్ అని ముందే బోర్డులు, హోర్డింగులు సిద్దం చేసుకోవాలని తెలుసు. తన డైలాగులు, మ్యానరిజంతో సినిమాను ప్రేక్షకులు పూర్తిగా పీల్ అయ్యేలా తీయటంలో త్రివిక్రమ్ దిట్ట. ఇక డబ్బులు ఖర్చపెట్టడంలో వెనకంజ వేయడని బండ్ల గణేష్ కు పేరుంది. వీరి కాంబినేషన్ లో సినిమా వస్తే కమర్షియల్ గా కూడా హిట్ అవుతుందని అప్పుడే టాక్ వస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో మాత్రం గణేష్ చెప్పలేదు.

గతంలో రామ్ చరణ్ నటించిన ‘పెప్సి’యాడ్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. కొన్ని సెకన్ల పాటు ఉండే ప్రకటనను డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ త్వరలో ఏకంగా రెండున్నర గంటల హంగామాను క్రియేట్ చేస్తాడన్నమాట. ఇక బండ్ల గణేష్ కు ఓ పద్దతి ఉంది. అదేమిటేంటే ఎవరితో అయితే డబ్బులు నష్టపోతాడో వారితో మరో ప్రాజెక్టు చేసి అంతకు అంతా రాబట్టుకుంటాడు అని అంతా అనుకుంటారు. ఉదాహరణకు పవన్ తో ‘తీన్ మార్’ తీసి నష్టపోయి..., ‘గబ్బర్ సింగ్’ తో మళ్ళీ బాగుపడ్డాడు. ఇక ఎన్టీఆర్ తో ‘బాద్ షా’ తీశాడు. పెద్దగా ఆడలేదు, అందుకే ఇప్పుడు పూరి డైరెక్షన్ లో శంషేర్(పేరు ఖరారు కాలేదు) నిర్మిస్తున్నాడు. అలాగే ఈ మూవీ కూడా అన్నమాట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్ పైకి వెళ్తే చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan  bandla ganesh  trivikram  latest news  

Other Articles