Ramgopal varma latest comments on mahesh babu and ntr

ramgopal varma latest movies, ramgopal varma on mahesh babu, ramgopal varma comments on ntr temper movie, ramgopal varma comparison mahesh babu pokiri businessman, ntr temper movie release date, temper audio release date, temper movie release date, puri jagannath next movies, mahesh babu koratala shiva movies, tollywood latest movie news updates

ramgopal varma latest comments on mahesh babu and ntr : controversy director ramgopal varma latest comments on mahesh babu and ntr movies creates controversy between both heros and fans of both heros, ram gopal varma says if temper release mahesh babu pokiri and businessman seems like flops

‘మహేష్ ప్లాపు, ఎన్టీఆర్ తోపు’.. మరి నువ్వు..?

Posted: 11/27/2014 10:32 AM IST
Ramgopal varma latest comments on mahesh babu and ntr

పబ్లిసిటీ కోసం
ఏమైనా చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఫేస్ బుక్ లోకి వచ్చారు. ఊరుకోకుండా గ్రేట్ మైండ్ లో అన్పించింది టైప్ చేశారు. ఏం చేస్తున్నాము.. ఎందుకు చేస్తున్నాము అనేది పట్టించుకోకుండా.., ఇన్వర్టెడ్ కొటేషన్లు, కామాలతో ఓ పది లైన్లు కొట్టేసి టార్గెట్ ను కంప్లీట్ చేసి లాగౌట్ అయ్యాడు. మహేష్ సినిమాలపై కామెంట్లు చేస్తే.., డైరెక్టర్ శ్రీను వైట్లపై రివేంజ్ తీర్చుకుంటున్నాడు అనుకున్నాం. కానీ.., అసలు టార్గెట్ మహేష్ అని ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. బుధవారం రాత్రి ఫేస్ బుక్ పేజీలో వర్మ చేసిన కామెంట్లు ఇవే స్పష్టం చేస్తున్నాయి.

బుధవారం(నవంబర్27) రాత్రి పేస్ బుక్ పేజలోకి వచ్చిన రాము ముందుగా ఎన్టీఆర్ సినిమాను పొగుడుతూ ఓ కామెంట్ పోస్ట్ చేశాడు. పూరీ కెరీర్ లో ‘టెంపర్’ మూవీ పెద్ద కమర్షియల్ హిట్ అవుతుందని ఆకాంక్షిస్తున్నా. పాటలు, సీన్లతో పాటు తారక్ నటన హైలైట్ అవుతుంది’ అని పోస్ట్ చేశాడు. ఇక్కడితో ఆగకుండా మరో కామెంట్ పెట్టాడు.., ఇందులో తన ఆత్మారావు ఆనందపడేలా మహేష్ పై విమర్శలు చేశాడు. పాపం మహేష్ కోసం పూరిని కూడా కాస్త ఇరకాటంలో పెట్టాడనుకొండి. ఎందుకంటే గతంలో మహేష్ తో పూరి కూడా సినిమాలు చేశాడు కదా.

రెండవ కామెంట్ లో ‘‘టెంపర్’ సినిమాతో జ‘గన్’గా మారితే... తారక్ ‘బుల్లెట్’అవుతాడు. ‘టెంపర్’లో తారక్ జ‘గన్’ నుంచి దూసుకొచ్చే బుల్లెట్ లా కన్పిస్తున్నాడు. మిస్సైల్ కంటే ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతాడు. ‘టెంపర్’తో పోలిస్తే ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ మూవీలు ఫ్లాపులుగా కన్పిస్తాయి. ఈ కామెంట్లు నేను తారక్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నా అని జనాలు అనుకోవచ్చు. కాని నాకు ఆ శక్తి లేదు. జగన్ తారక్ ను చేసినంత ‘టెంపర్’ నేను చేయలేను’. అని కామెంట్ చేశాడు. ఎన్టీఆర్ ను వాడుకుని మహేష్ పై కామెంట్లు చేసి వర్మ రాత్రి హాయిగా నిద్రపోయి ఉంటాడు. కానీ ఈ కామెంట్ల వల్ల ఇద్దరు హీరోలు, వారి అభిమానులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మహేష్ ను ఫ్లాపు హీరోగా.., ఎన్టీఆర్ ను తోపు హీరోగా కామెంట్ చేశావు కాని.., ఈగో తృప్తి పర్చుకునేందుకు ఇద్దరి మద్య చిచ్చు పెట్టిన నిన్ను ఏమనాలి..,? (రామ్ గోపాల్ వర్మ అని తప్ప ఇంకేమి అన్నా తక్కువే అవుతుంది)

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramgopal varma  mahsh babu  temper  ntr  puri jagannath  

Other Articles