నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై, నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తదుపరి చిత్రం పటాస్ పై భారీ అంచానాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి తొలిసారిగా దర్శకత్వం చేస్తున్న చిత్రంలో నటిస్తున్న కల్యాణ్ రామ్ పటాస్ సంబంధించిన టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. టీజర్ విడుదలతో చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించనుందన్న టాక్ సొంతం చేసకుంది. అనీల్ రవిపూడి అనేక చిత్రాలకు రచయితగా పనిచేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తాజాగా మహేష్ బాబు నటించిన అగడు చిత్రానికి కూడా కథను అందించింది రవిపూడే. తొలి పోస్టర్ తో మంచి టాక్ సోంతం చేసుకున్న దరమిలా.. చిత్ర యూనిట్ టీజర్ ను విడుదల చేసింది. టీజర్ కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. పోలిస్ గెటప్ లో వున్న కళ్యాన్ రామ్ ఇమిడిపోయారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధిచిన పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. కళ్యాన్ రామ్, శృతి సోది హీరోహీరియిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం అడియోను డిసెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ నెలలోనే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నందమూరి కళ్యాన్ రామే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయికుమార్; బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాస రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు మిగతా పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కెమెరా సర్వేష్ మురారి, సంగీతం సాయికార్తీక్, ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ ఎం కిరణ్ కుమార్, ఫైట్స్ పలాస్ వెంకట్, రచనా సహకారం ఎస్ క్రిష్ణ, ప్రోడక్షణ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ జే ఫణికుమార్, ఛీఫ్ కోడైరెక్టర్ సత్యం, కో డైరెక్టర్స్ ఎన్. క్రిష్ణ, మహేష్ ఆలంశెట్టి, నిర్మాణ కళ్యాణ్ రామ్, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం అనిల్ రావిపూడి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more