Swetha basu prasad denies movie rumours bollywood tollywood offers

swetha basu prasad latest news, swetha basu prasad movie news, swetha basu prasad prostitution, swetha basu prasad movie offers, swetha basu prasad press meet, swetha basu prasad interview, swetha basu prasad bollywood movie, swetha basu prasad re entry, swetha basu prasad item songs

swetha basu prasad denies movie rumours bollywood tollywood offers

ఆ పుకార్లను కొట్టిపారేసిన శ్వేత! ఆ వార్తల్లో వాస్తవం లేదట..?

Posted: 11/29/2014 04:03 PM IST
Swetha basu prasad denies movie rumours bollywood tollywood offers

వ్యభిచారం కేసులో అరెస్టయి రెస్క్యూరూంలో కొన్నాళ్లపాటు బంధీగా వున్న శ్వేతబసుప్రసాద్.. ఇటీవలే బయటికొచ్చి ముంబైలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే! బయటికొచ్చిన అనంతరం ఆమె తనను అనవసరంగా వ్యభిచారం కూపీలోకి లాగారని, అసలు విషయం ఏమీ తెలుసుకోకుండా పోలీసులు, మీడియావాళ్లు అసత్య ప్రచారాలు చేశారని ఈ అమ్మడు ఆవేదన వ్యక్తం చేసుకుంది. అయితే తాను అనుభవించిన కష్టాలనుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని.. ఇకమీదట తన గురించి అనవసరంగా ప్రచారాలు చేయొద్దని.. తిరిగి సినీ కెరీర్’ని కొనసాగించాలనుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు కొన్ని మూవీ స్ర్కిప్టులు కూడా చదువుతోందని సమాచారం!

ఇదిలావుండగా.. ఈమధ్య ఓ బాలీవుడ్ దర్శకనిర్మాత ఈమెకు ఒక మూవీ ఆఫర్ ఇచ్చాడని వార్తలు వస్తున్న సంగతి విదితమే! పైగా ఇతర భాషారంగ చిత్రపరిశ్రమకు చెందిన దర్శకనిర్మాతలు ఈమెకు వరుసగా ఆఫర్లు ఇస్తున్నారంటూ చెప్పుకుంటుననారు. అయితే ఇదే విషయమై శ్వేత మాట్లాడుతూ.. తనకు ఇంతవరకు ఏ సినిమాను ఒప్పుకోలేదని, ఏ మూవీలోనూ నటించడం లేదని స్పష్టం చేసింది. సినిమా ఆఫర్లకోసం వెయిట్ చేస్తున్న విషయం వాస్తవమేగానీ.. ఇంకా అవకాశాలు మాత్రం రాలేదని ఆమె స్పష్టం చేసింది. అలాగే హంసల్ మెహతా సినిమాలో తాను నటించడం లేదని ఆమె వివరించింది.

వ్యభిచారం కూబిలో శ్వేత ఇరుక్కున్నప్పుడు కొంతమంది సినీతారలు ఈమెకు మద్దతు పలికారు. అందులోభాగంగా ఈమె బాల్యనటిగా నటించిన ‘మక్డీ’ మూవీ డైరెక్టర్ ఆమెకు మూవీ ఆఫర్ ఇస్తానని తెలిపాడు. అలాగే టాలీవుడ్’లో కూడా ఈమెకు మంచి సినిమాలో ఆఫర్లు ఇస్తామంటూ ఆమధ్య కొంతమంది తెలిపినట్లు వార్తలొచ్చాయి. దీంతో శ్వేత సినీ ప్రస్థానం తిరిగి ప్రారంభం అయిందని, ఇక ఆమె దశ తిరిగిందని అనుకున్నారు. బయటికొచ్చిన అనంతరం రెండు, మూడు ఆఫర్లైన వచ్చి వుంటాయని భావించారు. కానీ తనకు ఇంతవరకు ఒక్క మూవీ ఆఫర్ కూడా రాలేదని, ఏ సినిమాని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles