Sonakshi sinha arjun kapoor love affair request bollywood media tevar movie news

sonakshi sinha, sonakshi sinha latest news, sonakshi sinha hot photos, sonakshi sinha latest gossips, sonakshi sinha movies, sonakshi sinha tevar movie, tevar movie news, sonakshi sinha hot photo shoot, sonakhsi sinha liplock scenes, sonakshi sinha gallery, arjun kapoor, sonakshi arjun kapoor love, sonakshi sinha love affairs, bollywood media

sonakshi sinha arjun kapoor love affair request bollywood media tevar movie news

‘‘నన్నొదిలేయండ్రా బాబూ...’’ అంటూ సొనాక్షీ రిక్వెస్ట్!

Posted: 11/29/2014 04:19 PM IST
Sonakshi sinha arjun kapoor love affair request bollywood media tevar movie news

ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లకు సంబంధించి సినీవార్తలకంటే వాళ్ల ‘‘ప్రేమ’’ వ్యవహారాలే సంచలనంగా నిలిచిపోతాయి. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షీ సిన్హానే తీసుకోవచ్చు. ఎందుకంటే... ఈ అమ్మడు ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించిందో.. ఆయా హీరోలతో కలిసి ప్రేమవ్యవహారాలు నడిపిందంటూ ఫుల్లుగా ప్రచారాలు జరిగిపోయాయి. ఇప్పుడు మరోసారి అటువంటి వార్తలే మళ్లీ తెరమీదకొచ్చాయి. ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొడుకు అర్జున్ కపూర్’తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు తెగ తిరిగేస్తున్నాయి.

ప్రిన్స్ మహేష్’బాబు నటించిన ‘‘ఒక్కడు’’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతోనే ఆయన కెరీర్ మలుపు తిరిగిందని అంటుంటారు. అంతటి ఘనవిజయం సాధించిన ఆ సినిమాను ఇప్పుడు బాలీవుడ్’లో రీమేక్ చేస్తున్నారు. సోనాక్షి, అర్జున్ జంటగా నటిస్తున్న ‘‘తేవర్’’ సినిమాయే ‘‘ఒక్కడు’’ రీమేక్! ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలో ఆ ఇద్దరు జంటలు ప్రేమలో పడిపోయారని.. రెస్టారెంట్లకు, పబ్బులకు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని.. అందులో ముఖ్యంగా ముంబై రెస్టారెంట్లలో ఈ జంట తరుచుగా కనిపిస్తున్నారనీ ఇప్పటికే బోలెడు ప్రచారాలు కొనసాగిపోయాయి.

ఈ విషయమై సోనాక్షి సిన్హాను ప్రశ్నిస్తే.. ‘‘అలాంటిదేం లేదు, మమ్మల్ని వదిలేయండి బాబోయ్...’’ అని బదులిస్తోంది. ‘‘మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటిస్తే ప్రేమలో పడిపోయినట్టేనా? ఏదో ఇద్దరం కలిసి సరదాగా అలా వెళితే.. ఇక మా మధ్య ఎఫైర్ వున్నట్టేనా? ఇప్పటికే ఇటువంటి చెత్తవార్తలు చదివి చదివి నేను చాలా విసిగిపోయాను. అసలు ఆ వార్తలు వింటుంటేనే చిరాకొస్తోంది. దయచేసి నన్ను వదిలేయండి. ఇటువంటి అసత్య ప్రచారాల్లో నా పేరు లాగకండి’’ అంటూ బాలీవుడ్ మీడియాను రిక్వెస్ట్ చేసిందని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonakshi sinha  arjun kapoor  tevar movie  actresses love affairs  bollywood media  telugu news  

Other Articles