Allu arvaind comments varun tej mukunda movie audio release

allu arvaind on varun tej, allu arvaind on mukunda movie, allu arvaind movies, mukunda movie audio songs, varun tej mukunda audio songs, mukunda audio release function photos highlights, mukunda movie release date, mukunda movie latest updates, chiranjeevi on mukunda varun tej, allu arjun sai dharam on varun tej, mega prince

allu arvind comments varun tej mukunda movie audio release : producer allu arjun raised a interesting topic in mukunda audio release function says that when varun in his childhood used to call chiranjeevi as daddy all shocked during those days that who is chiru son varun or charan

చిరంజీవి కొడుకు వరుణా?... చరణా?...

Posted: 12/04/2014 08:51 AM IST
Allu arvaind comments varun tej mukunda movie audio release

మెగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్న సమయంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్లు ఒక్కసారిగా షాక్ కు గురిచేస్తున్నాయి. ‘ముకుంద’ ఆడియో రిలీజ్ వేడుకకు హాజరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ.., వరుణ్ చాలా తెలివైన కుర్రాడన్నారు. తన ముందు చిన్న పిల్లాడిలా తిరిగిన అబ్బాయి, ఇవాళ స్టార్ హీరో అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా వరుణ్ చిన్నతనంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించటంతో అంతా ఆశ్చర్యపోవటంతో పాటు కాసేపు నవ్వుకున్నారు.

వరుణ్ చిన్నపుడు చిరంజీవిని డాడీ అని పిలిచేవాడని అరవింద్ అన్నాడు. అలా పిలుస్తుండటంతో.., చిరంజీవి కొడుకు చరణా..? వరుణా.. అని అంతా కన్ఫ్యూజ్ అయ్యేవారని తెలిపాడు. అలా చిన్నతనం నుంచి చాలా దగ్గరగా పెరిగాడని చెప్పాడు. తెలివైన కుర్రాడికి మంచి తనం తోడయితే వరుణ్ తేజ్ లా ఉంటాడని అరవింద్ మెచ్చుకున్నాడు. ఈ మూవీ తప్పుకుండా సూపర్ హిట్ అవుతుందనా ఆశించారు. వరుణ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ముకుంద’ ఆడియో బుధవారం విడుదల అయింది. డిసెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన మూవీని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేశాడు. మంచి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arvaind  mukunda  varun tej  chiraneevi  naga babu  

Other Articles