Varun tej debut mukunda movie audio release highlights photos

mukunda movie audio songs, varun tej mukunda audio songs, varun tej mukunda movie full songs, mukunda audio release function photos highlights, mukunda movie release date, mukunda movie latest updates, varun tej latest movie updates, tollywood latest news updates, chiranjeevi on mukunda varun tej, allu arjun sai dharam on varun tej, mega prince

varun tej mukunda movie audio release highlights : mega brother nagababu son varun tej debut mukunda movie audio release function got good response from fans with presence of chiranjeevi, allu arjun, sai dharam tej and many of tollywood faces

మిస్సైల్ లా వచ్చిన ‘మెగా ప్రిన్స్’

Posted: 12/04/2014 08:17 AM IST
Varun tej debut mukunda movie audio release highlights photos

టాలీవుడ్ లో ఇప్పటివరకు ప్రిన్స్ గా మహేష్ బాబు ఉండగా.., కొత్తగా మరో ప్రిన్స్ వచ్చాడు. మెగా ఫ్యామిలి యువ హీరో.., నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను అంతా ప్రిన్స్ అంటున్నారు. మెగా ఫ్యాన్స్ ఆయనకు ‘మెగా ప్రిన్స్’అని పేరు పెట్టారు. వరుణ్ తేజ్ నటించిన ‘ముకుంద’ ఆడియో రిలిజ్ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. కన్నుల పండువగా.., కుటుంబ కార్యక్రమంగా జరిగిన వేడుకలో చిరంజీవి సహా మెగా ఫ్యామిలి హీరోలు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు వంటి సిని ప్రముఖులు పాల్గొన్నారు. వరుణ్ తొలి సినిమా సూపర్ హిట్ అవుతుందని వారంతా ఆశీర్వదించారు.

ఆడియో రిలీజ్ సందర్బంగా సీడీని ఆవిష్కరించి మాట్లాడిన మెగా స్టార్ చిరంజీవి తమ కళ్ళముందు అడుగులు వేయటం నేర్చుకున్న పిల్లలు ఇప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడుతుంటే ఆశ్చర్యంవేస్తోందని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఇండస్ర్టీలోకి వచ్చాక స్టేజిపై మాట్లాడేందుకు తమకు చాలాకాలం పట్టగా.., ప్రస్తత హీరోలు తొలి సినిమాతోనే ఛాన్స్ కొట్టేస్తున్నారని గుర్తు చేసుకున్నారు. వరుణ్ తేజ్ హైట్ లోనే కాదు.., ఉన్నత శిఖరాలు అధిరోహించటంలోనూ ఎత్తుకు ఎదుగుతాడని ఆకాంక్షించారు. ఈ సినిమాకు సిరివెన్నెల సీతరామశాస్ర్తి పాటలు రాయటం వరుణ్ అదృష్టం అన్నారు. కార్యక్రమంలో సిరివెన్నెలను సత్కరించారు.

‘ముకుంద’ మూవీ కుటుంబ కథా చిత్రంగా మిగులుతుందని పాటల రచయిత సిరివెన్నెల అన్నారు. ఊహకు అందని విషయాలు, మానవ సంబంధాలను డైరెక్టర్ శ్రీకాంత్ చక్కగా చూపించగలడన్నారు. వరుణ్ తేజ్ మిస్సైల్ లాంటి స్టార్ అని మెచ్చుకున్నారు. ఇక ముకుంద సినిమాను తాను ఐదు సార్లు చూడాలనుకుంటున్నట్లు డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. సినిమా గురించి మాట్లాడిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.., వరుణ్ తో సినిమా అరుదైన అవకాశంగా పోల్చారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సమయంలో వచ్చిన ఆలోచనను నాగబాబుకు చెప్తే వరుణ్ ను తనకు అప్పగించి సినిమా చేసుకోమన్నారని., ఇది ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.

ఇక కార్యక్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే పాట హైలైట్ అయింది. సినిమాలోని ఓ పాట పాడిన అమ్మడు అభిమానులను అలరించింది. వరుణ్ చాలా మంచి వాడని.., సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ కూడా తన మనోభావాలు పంచుకున్నారు. తెలుగు రాకపోయినా తనకు అవకాశం ఇస్తున్నందుకు ప్రతి డైరెక్టర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ‘ముకుంద’ను ఆశీర్వదించారు. తన కళ్ల ముందు తిరిగిన చిన్న పిల్లాడు స్టార్ హీరో కావటం చాలా సంతోషం కల్గిస్తోందన్నారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej  mukunda  audio launch  chiranjeevi  mega prince  

Other Articles