Mahesh babu koratala shiva movie second schedule shooting

mahesh babu koratala shiva movie, mahesh babu koratala shiva movie shooting schedule, mahesh babu koratala shiva rfc shooting, mahesh babu movie updates, mahesh babu sruti haasan movie latest photos, sruti hassan latest updates, tollywood latest updates

mahesh babu koratala shiva movie second schedule shooting : tollywood prince mahesh babu latest movie in koratala shiva direction shooting started in ramoji film city, on first day of rfc shooting schedule koratala shiva canned introduction song on mahesh babu

పండు బాబు బాగా కష్టపడుతున్నాడు

Posted: 12/11/2014 02:45 PM IST
Mahesh babu koratala shiva movie second schedule shooting

ఫ్యాన్స్ ఉన్నంత వరకే సినిమా స్టార్లకు లైఫ్ ఉంటుంది. ఫ్యాన్స్ హర్ట్ అయితే ఎంత పెద్ద స్టార్ అయినా... నేలరాలక తప్పదు. ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..., ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడుతున్నాడు. వరుసగా ఫ్లాపులు పడటంతో ఈ సారి వచ్చే సినిమా.., రెండు సినిమాలను కవర్ చేయాలని కసిగా ఉన్నాడు. మహేష్ అంటే ఓ మ్యానరిజం. ఫైట్లు, మాటలు, యాక్టింగ్ అన్ని స్పెషల్ గా ఉంటాయి. ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి డాన్స్ మాత్రం కాస్త మైనస్ పాయింటే. ఇదే విషయాన్ని ఫ్యాన్స్ కూడా కొన్నిసార్లు అంగీకరించారు. ఇది గ్రహించి కాళ్లను కాస్త ఎక్కువగా ఊపుతున్న మహేష్.., తాజా సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడట.

గతంతో పోలిస్తే ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ సినిమాల్లో డాన్స్ కాస్త బాగుందనే టాక్ రావటంతో.., ఆ సినిమాల కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ను కొరటాల సినిమాలోకి తీసుకున్నారట. ప్రస్తుతం రామోజి ఫిలింసిటీలో జరుగుతున్న పాట షూటింగ్ లో మహేష్ చాలా కష్టపడి డాన్స్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంట్రడక్షన్ సాంగ్ కావటంతో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసేందుకు ప్రేమ్ రక్షిత్ కు తెలిసిన విద్యనంతా ఉపయోగించి స్టెప్పులేయిస్తున్నాడట. రెండు సినిమాల నుంచి పికప్ అందుకున్న ప్రిన్స్ ఈ పాటకు మంచి స్టెప్పులేస్తున్నాడని మూవీ యూనిట్ చెప్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu latest movie  koratala shiva movies  sruti haasan mahesh movie  

Other Articles