Daggubati rana birthday rudramadevi movie first look chalukya emporer

daggubati rana, daggubati ramanayudu, rudramadevi movie, rana rudramadevi first look, daggubati rana rudramadevi first look, rudramadevi movie first look, anushka shetty, allu arjun, director guna sekhar, daggubati rana first look, rudramadevi movie

daggubati rana birthday rudramadevi movie first look chalukya emporer : daggubati rana first look in rudramadevi movie has released on his birthday special.

నవతరం చాళుక్య యువరాజు వచ్చేశాడు...

Posted: 12/13/2014 02:42 PM IST
Daggubati rana birthday rudramadevi movie first look chalukya emporer

దగ్గుబాటి సినీకుటుంబ నేపథ్యం నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానాకు.. ఇంతవరకు సోలోగా ఒక్క హిట్ కూడా దక్కలేదు. అటు బాలీవుడ్’లోనూ రానా నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తాపడ్డాయి. టాలీవుడ్ కండలవీరుడిగా రాను పేరుతెచ్చుకున్నప్పటికీ.. సోలో హీరోగా ప్రత్యేకస్థానాన్ని ఏర్పరుచుకోలేకపోయాడు. ఇప్పటికీ తనను తాను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. అందుకే.. అందివచ్చిన అవకాశాలను వదిలిపెట్టకుండా వరుసగ ఒప్పుకుంటున్నాడు. ఇందులో భాగంగానే భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘‘రుద్రమదేవి, బాహుబలి’’ వంటి చిత్రాల్లో పత్ర్యేక పాత్రల్లో నటిస్తున్నాడు.

ఇదిలావుండగా.. రుద్రమదేవి చిత్రంలో నిడదవోలు యువరాజు చాళుక్య వీరభద్రుడు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే! కానీ.. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాదికిపైగా కావస్తున్న ఇంతవరకు రానాకు సంబంధించి ఫస్ట్’లుక్ విడుదల కాలేదు. తాజాగా అతని బర్త్’డే (14-12-2014) సందర్భంగా ఆ చిత్రంలోని రానా పాత్రకు సంబంధించి చిత్రబృందం ఫస్ట్’లుక్’ని విడుదల చేసింది. ఇందులో రానా ఒక చేతిలో కత్తి పట్టుకుని, అదిరిపోయే రీతిలో కనిపిస్తున్నాడు. అలాగే అతని బ్యాక్స్’గ్రౌండ్’లో చాళుక్య కాలం నాటికి సంబంధించి కట్టడంలాగే అద్భుతంగా అమర్చారు. ఇదివరకే అనుష్క, అల్లుఅర్జున్’ల ఫస్ట్’లుక్’లకు అభిమానుల నుంచి మంచి ప్రస్తావన రాగా.. రానాకు అలాగే రెస్పాన్స్ లభిస్తోంది.

ఇలా అప్పుడప్పుడు ఆ చిత్రంలో నటిస్తున్నవారి ఫస్ట్’లుక్’లను విడుదలను చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్న ఆ మూవీ భారీ విజయాన్నే అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. అలాగే గతకొన్నాళ్లనుంచి సరైన హిట్ లేక సతమతమవుతున్న దర్శకుడు గుణశేఖర్.. ఈ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక రానాకు సోలో హిట్ లేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్’తోనైనా మంచి పేరు సాధించాలనే ఆశతో వున్నాడు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. రానాకు ఏమేరకు హెల్ప్ అవుతుందో..? వెయిట్ చేయాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : daggubati rana first look  rudramadevi movie  anushka shetty  allu arjun  

Other Articles