Pawan kalyan gabbar singh 2 movie ghmc elections hyderabad

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan gabbar singh 2 movie schedule, pawan kalyan janasena, janasena party news, janasena party, ghmc elections, hyderabad elections, pawan kalyan janasena news, gabbar singh 2 movie news

pawan kalyan gabbar singh 2 movie ghmc elections hyderabad : the gabbar singh 2 project of pawan kalyan is stopped due to ghmc elections. Pawan kalyan now concentrated on his party to win in the ghmc elections.

అర్థంతరంగా నిలిచిపోతున్న ‘గబ్బర్’!

Posted: 12/13/2014 01:21 PM IST
Pawan kalyan gabbar singh 2 movie ghmc elections hyderabad

గత రెండేళ్లనుంచి ఎంతగానో ఊరిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్ ‘‘గబ్బర్ సింగ్-2’’ మూవీ.. మొన్నటికిమొన్న షూటింగ్ ప్రారంభం చేసుకునేందుకు అన్నీ కార్యక్రమాలను సిద్ధం చేసుకుందికానీ.. ఈసారి కూడా మళ్లీ అర్థంతరంగా ఆగిపోయిందనే సమాచారాలు వెలువడుతున్నాయి. ‘‘గోపాల గోపాల’’ చిత్రంలో పవన్ షూటింగ్ పార్ట్ ముగియగానే ‘‘గబ్బర్’సింగ్-2’’ షూటింగ్ మొదలవుతుందని, అందుకు సంబంధించి అన్నీ కార్యక్రమాలను దర్శకనిర్మాతలు పూర్తి చేసుకున్నారని కొన్నిరోజుల నుంచి వార్తలొస్తున్నాయి. నటీనటుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఇక షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటుండగానే.. అర్థంతరంగా నిలిచిపోయింది. అందుకు కారణమేంటో తెలుసా..?

పవన్ కల్యాన్ ‘‘జనసేన’’ పార్టీతో రాజకీయరంగప్రవేశం చేసిన విషయం విదితమే! సార్వత్రిక ఎన్నికలప్పుడు ఇతర పార్టీలకు మద్దతు పలికిన పవన్.. ఆ తర్వాత సినిమాలతోబాటు తన పార్టీని మరింత బలపరుచుకునేందుకు ప్రయత్నాల్లో మునిగిపోయారు. అప్పుడే ఎన్నికల కమిషన్’లో తన పార్టీకి గుర్తింపు తెచ్చుకున్న పవన్.. తన పార్టీవర్గాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేసినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అలాగే ప్రస్తుతం రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో విజయం సాధించి, తన పార్టీ సత్తా నిరూపించుకునేందుకు ఆ పార్టీ వర్గాలు పూర్తిగా మునిగిపోయాయి.

ఇక రాజకీయరంగంలో ‘జనసేన’ మొదటిసారిగా ఎన్నికల్లో పోటీచేయనుంది కాబట్టి.. పవన్ కూడా దానిమీదే ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా.. జనసేన పార్టీ సభ్యత్వం పొందెందుకు చాలామంది కార్యకర్తలు కూడా పార్టీ కార్యాలయం ముందు క్యూ కట్టినట్లు సమారాలొస్తున్నాయి. పవన్’కున్న క్రేజ్’తో జనసేన రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతుందనే నమ్మకంతో చాలామంది కార్యకర్తలు సభ్యత్వం పొందేందుకు తాపత్రయపడుతున్నారు. అలాగే పవన్ కూడా తన పార్టీని గెలిపించుకునేందుకు రంగంలోకి దిగినట్లు వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి.

ఈ ఎన్నికల నేపథ్యంలో పవన్ బిజీగా వుండటం వల్లే తన ‘‘గబ్బర్ సింగ్-2’’ ప్రాజెక్ట్’ను పక్కనబెట్టేశారని ఇండస్ట్రీవర్గాలు అంటున్నాయి. ఎన్నికల తరువాతే గబ్బర్ ప్రాజెక్ట్ సెట్స్’పైకి వెళుతుందని, అంతవరకు పవన్ కేవలం తన పార్టీ కార్యకలాపాలపైనే ఎక్కువ సమయం కేటాయించనున్నారని సమాచారం! మరి ఈ విషయంపై అభిమానుల స్పందన ఎలా వుంటుందో వెచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gabbar singh 2 movie  janasena party  ghmc elections  

Other Articles