Rudramadevi movie rana anushka romance scenes

rana anushka romance scenes, rana anushka romantic scenes, rana anuska in rudrama devi movie, rudramadevi movie updates, rana new look in rudramadevi, rudramadevi movie release date, tollywood latest updates

rana anushka romance scenes in rudramadevi : director of rudramadevi gunashekar reveals that rana will be seen in romantic and intimate scenes. rana anushka erotic scenes are highlights for rudramadevi movie says gunashekar

రానా-అనుష్క రొమాన్స్ సన్నివేశాలు

Posted: 12/15/2014 10:47 AM IST
Rudramadevi movie rana anushka romance scenes

అనుష్క లీడ్ రోల్ గా తెరకెక్కిన ‘రుద్రమదేవి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి విడుదల కోసం సినిమాను సిద్దం చేస్తున్నారు. ఆదివారం రోజు రానా పుట్టినరోజు కావటంతో.., సినిమాలో నటించిన ఆయన ఫోటోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా మాట్లాడిన మూవీ డైరెక్టర్ గుణశేఖర్ ‘రుద్రమదేవి’లో రానా నిదవర్ద్యపురం (నిడుదవోలు) యువరాజు చాలుక్య వీరభద్రుడి పాత్ర పోషించినట్లు చెప్పాడు.

ఈ పాత్ర రానాకు సరిగ్గా సూట్ అవుతుందన్నాడు. సినిమా వివరాలు వెల్లడిస్తూ.., రానా కేవలం పోరాట యోధుడుగానే కాకుండా.., రొమాంటిక్ పర్సన్ గా కన్పిస్తాడన్నారు. అనుష్క-రానా మద్య సినిమాలొ రొమాన్స్ సన్నివేశాలు ఉన్నాయనీ.., అవి మూవికి హైలైట్ అవుతాయన్నారు. అంటే ఈ  సినిమాలో రానా బాగానే రొమాన్స్ చేశాడన్నమాట. ‘రుద్రమదేవి’ అనగానే కాకతీయుల వీరనారి గుర్తుకుతీసుకొచ్చేలా సినిమా తీస్తాడని అనుకున్నారు. కాని వాటిలో రొమాన్స్ సీన్లు కూడా ఉంటాయని ఎవరూ అంచనా వేయలేదు.

ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీని కల్పించింది. అటు గోన గన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్ కూడా తెలుగు ప్రముఖులకు చెందిన సినిమా కావటంతో ఒక్క రూపాయి కూడా వద్దని చెప్పి నటించాడు. ఇలా సినిమాపై చాలామందికి మంచి ఇంప్రెషన్ ఉంది. కాని రొమాన్స్ సీన్లు అనేసరికి వినటానికి విడ్డూరంగా, ఎబ్బెట్టుగా ఉంది. ఈ సీన్లలో రుద్రమదేవిని ఏ మాత్రం కాస్త నెగెటివ్ షేడ్ లో చూపించినా.., సీన్ సితార అయిపోతుంది. అసలు సినిమాలో ఉన్న రొమాన్స్ ఏమిటి.., ఎందుకు రొమాన్స్ చేసింది? అనే విషయం తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rana anushka romance  rudramadevi movie updates  tollywood latest updates  

Other Articles