Pooja hegde in mukunda movie hrithik roshan movie

pooja hegde on mukunda movie, pooja hegde interview, pooja hegde on mohanjadaro movie, pooja hegde hrithik roshan movie updates, mohanjadaro shooting photos, hrithik roshan latest news updates, bollywood latest updates, tollywood latest news updates, hrithik roshan movie updates, mukunda movie release date, varun tej mukund latest updates

pooja hegde in mukunda movie hrithik roshan movie : tollywood young actress pooja hegde says mukunda movie will be a biggest hit for her and also says she had given bulk of six months to hrithik roshan movie mohanjadaro

పాప ఆఫర్ కోసం అదృష్టం వదలుకుంది

Posted: 12/17/2014 04:19 PM IST
Pooja hegde in mukunda movie hrithik roshan movie

అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు. ఒకటి కావాలనుకుంటే మరొకటి వదులుకోవాల్సిందే. ఆఫర్, అదృష్టం ఒకసారి వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నిస్తే.., ఆఫర్ నే ఎంచుకుంటానని పూజా హెగ్డే చెప్తోంది. తెలుగులో పలు సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్న అమ్మడు ‘ముకుంద’ మూవీలో కూడా నటించింది. ఇక ఈ కన్నడ భామకు.., భారీ ఆఫర్ వచ్చింది. హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న ‘మొహంజాదారో’ మూవీలో అమ్మడికి ఛాన్స్ వచ్చిందట. అసలే బాలీవుడ్ మూవీ ఆపై హృతిక్ ది కావటంతో మరోమాట లేకుండా ఓకే చెప్పేసిందట.

ఈ మూవీ తన కలలో కూడా ఊహించని ఆఫర్ అని చెప్తోంది. ఆరు నెలల పాటు బల్క్ డేట్లు ఇచ్చేయటంతో చాలా సినిమాలకు నో చెప్పాల్సి వచ్చిందట. ఇందులో మణిరత్నం సహా చాలా మంది ప్రముఖుల సినిమాలు ఉన్నాయని పూజా చెప్తోంది. అందరికి దొరకని అదృష్టం లాంటి మణి రత్నం సినిమా వద్దని చెప్పినపుడు చాలా బాధపడి ఆయన్ను స్వయంగా కలిసి సారి చెప్పిందట. మంచి ఆఫర్ కావటంతో డైరెక్టర్ దిగ్గజం కూడా పర్వాలేదు అని ప్రోత్సహించాడట.

ఇకపోతే ‘ముకుంద’ మూవీ గురించి పూజాకు చాలా అంచనాలే ఉన్నాయి. ‘ముకుంద’ సినిమా తన కెరీర్ లో మంచి హిట్ సినిమా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్ గా ఉండటంతో పాటు మంచి ఎనర్జీని చూపించాడని ప్రశంసించింది. కళ్ళతోనే కంటెంట్ ను చెప్పేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి వరుణ్ అని తెగ పొగుడుతోంది. ఈ సినిమాలో వరుణ్ పేరు చెప్పకుండా కథ అంతా కొనసాగుతుందని సీక్రెట్ రివీల్ చేసింది. ఈ నెల 24న విడుదల అవుతున్న ‘ముకుంద’ మూవీ సూపర్ హిట్ కావాలని ‘తెలుగు విశేష్’ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja hegde interview  mukunda movie latest  hrithik roshan mohanjadaro  

Other Articles