Jabardasth controversy nagababu serious goud agitators venu attack

nagababu on jabardasth venu attack, nagababu comments on venu attack, nagababu on jabardasth protest, venu wonders jabardasth comedy controversy, venu on jabardasth latest update, jabardasth venu attacked, jabardasth latest updates, goud agitators on jabardasth venu, etv telugu programmes, telugu popular tv shows

jabardasth controversy nagababu serious goud agitators venu attack : jabardasth comedy show judge nagababu serious on attackers of venu and says show is not focused to target criticise any one and agitators must go by court and law but attacking on artists is shame

తప్పుంటే చెప్పాలి కాని.. చేయి చేసుకుంటారా...?

Posted: 12/22/2014 04:41 PM IST
Jabardasth controversy nagababu serious goud agitators venu attack

తెలుగు పాపులర్ కామెడి షో ‘జబర్దస్త్’ కాంట్రవర్సీ కొనసాగుతోంది. వేణుపై గౌడ సంఘ నేతలు దాడి చేయటంతో పాటు.., కేసు పెట్టగా, ఈ దాడిపై జబర్దస్త్ టీం నిరసన వ్యక్తం చేసింది. టీం జడ్జి నాగబాబు సహా ఆర్టిస్టులంతా దాడిని తప్పుబట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మూవీ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ లో కామెడి చేయటం కోసం చాలా కష్టపడే ఆర్టిస్టులపై దాడి చేయటం దారుణమన్నారు. కామెడి స్కిట్ లో తప్పులు ఉంటే.., ఆర్టిస్టులు మనోభావాలు దెబ్బతీసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప.., చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సరికాదని నాగబాబు చెప్పారు.

అటు గౌడ కుల సంఘం నేతలు కూడా జబర్దస్త్ టీంపై మండిపడుతున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో వ్యంగ్య కామెంట్లు చేస్తే వేణుకు వార్నింగ్ ఇచ్చామన్నారు. అయినా సరే పద్దతి మార్చుకోలేదు కాబట్టే ఈ తరహా ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. జబర్దస్త్ టీం క్షమాపణలు చెప్పేవరకు తాము శాంతించమని నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఒక వైపు కంప్లయింట్లు, మరోవైపు దాడులతో కామెడి షో కాస్తా కాంట్రవర్సీ షోగా మారుతోంది. వినోదాన్ని పంచాల్సిన సమయాన్ని వివాదాల కోసం వినియోగించి కళకారులు కొత్త కష్టాన్ని తెచ్చుకుంటున్నారు. టీఆర్పీల కోసం ప్రేక్షకులు కోరుకోని కామెడిని వారిపై రుద్దే ప్రయత్నంలోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. అదే లేకుండా క్లీన్ కామెడి ఉంటే ఎంత బాగుండేది. జబర్దస్త్ షో జబర్దస్త్ గా నడిచేది. ఇప్పటికైనా టీం సభ్యులు వాస్తవం తెలుసుకుంటే ఉత్తమం.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : nagababu latest  jabardasth venu attack  etv telugu programmes  

Other Articles