Jabardasth nagababu comments mukunda movie release problems

mukunda movie release problems, mukunda movie release date, jabardasth comedy show controversy, jabardasth venu attack, jabardasth controversy venu video, mukunda movie faces problems, nagababu on venu attack, mukunda movie latest updates, mukunda movie photos teasers, varun tej next movies updates

jabardasth nagababu comments mukunda movie release problems : mega fans fears about mukunda movie release after nagababu comments on goud cast organisation leaders may calls to stop movie release

‘ముకుంద’కు నాగబాబు ముప్పు... విడుదలపై అనుమానం

Posted: 12/22/2014 05:24 PM IST
Jabardasth nagababu comments mukunda movie release problems

తనయుడిని ఇండస్ర్టీలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడిన తండ్రి నాగబాబు సినిమా విడుదలకు అడ్డంకిగా మారే ప్రమాదం ఏర్పడింది. వరుణ్ తేజ్ తొలి సినిమాకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాంట్రవర్సీ షోగా మారిన కామెడి షో జబర్దస్త్ ఇందుకు కారణం అవుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం వరకు సీన్ లోకి నాగబాబు ఎంటర్ కాలేదు. అయితే కమెడియన్లతో పాటు నాగబాబు కూడా దాడికి వ్యతిరేకంగా మాట్లాడటంతో.., మూవీకి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

అనుభవాల వల్లనే అనుమానాలు :

తెలంగాణ ఉద్యమ సమయంలో సినిమా పరిశ్రమ గజగజలాడింది. మూవీలు విడుదల చేయాలంటే.., దర్శక నిర్మాతలు వణకాల్సిన పరిస్థితి. కనీసం షూటింగులు చేసుకుందామన్నా దాడులు జరిగి ఏమవుతుందో అని భయాందోళనలు వ్యక్తం అయ్యేవి. ఉద్యమ సమయంలో చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించినందుకు ఆయన తనయుడి సినిమాలు ఆడనివ్వలేదు. వాస్తవానికి చరణ్ తెలంగాణపై కామెంట్ చేయకున్నా తండ్రి వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నాగబాబు కూడా ఒక వర్గ దాడిని ఖండించి ఆగ్రహం వ్యక్తం చేయటంతో.., ఆయన తనయుడి సినిమాను సదరు వర్గం అడ్డుకునే అవకాశం ఉందని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

ఇప్పటివరకు సినిమాను అడ్డుకుంటామని ఆందోళనకారులు ప్రకటించలేదు. అయితే ఫ్యాన్స్ ఊహించిందే నిజమైతే పరిస్థితి ఏమిటి?. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొలి సినిమా ఈ నెల 24న విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. సినిమా పాటలు, ట్రైలర్లు, మెగా హీరో, డైరెక్టర్ వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. తొలి సినిమాతో అభిమానులకు వరుణ్ దగ్గరవుతాడని టాక్ వచ్చింది. ఈ సమయంలో ఇలా వివాదాలు ఏర్పడి.., అది సినిమా విడుదలను అడ్డుకుంటే వరుణ్ కెరీర్ కు ఇబ్బందికరం. కాబట్టి అలా జరగకూడదు అని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ వివాదం చివరకు ఎటు వెళుతుందో వేచి చూద్దాం.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : mukunda movie  nagababu comments  jabardasth controversy  

Other Articles