Shweta basu prasad special interview intelligent idiots movie promotion

Shweta Basu Prasad news, Shweta Basu Prasad prostitution case, Shweta Basu Prasad item songs, Shweta Basu Prasad intelligent idiots movie, Shweta Basu Prasad hot photos, Shweta Basu Prasad controversies, Shweta Basu Prasad movies, intelligent idiots movie news

Shweta Basu Prasad special interview intelligent idiots movie promotion : shweta basu prasad participating in intelligent indiots movie promotional events. In this event she said some controversial opinions on movie.

అలా చేయడంలో తప్పేముంది..?

Posted: 01/22/2015 05:38 PM IST
Shweta basu prasad special interview intelligent idiots movie promotion

గతేడాది వ్యభిచారం కేసులో పట్టుబడి రెండునెలలపాటు రెస్క్యూహోంలో బందీగా వున్న శ్వేతాబసుప్రసాద్.. ఇటీవలే విడుదలై తిరిగి తన స్టార్ ఇమేజ్’ని పొందేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తోంది. కొన్నాళ్లపాటు ఇంటిచాటునే వున్న ఈ ‘కొత్త బంగారులోకం’ భామ.. ఇప్పుడు అన్నీ ఇండస్ట్రీల్లోనూ చక్కర్లు కొడుతూ తన అనుభవాలను పంచుకుంటోంది. తన జీవితంలో ఎదుర్కొన్న అనూహ్య సంఘటనలను మరిచిపోయి, తిరిగి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు అప్పుడు కార్యకలాపాలను సిద్ధం చేసుకుంది. అంతేకాదు.. ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కున్న సమయంలో ఎంతోమంది ఈమెకు మద్దతు పలికిన సందర్భంలో.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు తమ మూవీల్లో ఆఫర్లు ఇస్తామని ప్రకటించిన సంగతి విదితమే! ఇప్పుడు వాటిపైనే ఈ అమ్మడు చర్చలు కొనసాగిస్తోందని సమాచారం!

ఇదిలావుండగా.. ఈ అమ్మడు వ్యభిచారం కేసులో అరెస్ట్ కాకముందే ‘ఇంటెలిజెన్స్ ఇడియట్స్’ అనే సినిమాలో ఓ ఐటెం సాంగులో నటించింది. ఆ మూవీ ఇప్పుడు ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది కాబట్టి.. ఆ మూవీ ప్రమోషన్ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. అందుకే.. అన్నిరకాల ఛానెల్స్’లో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మూవీకి సంబంధించిన విశేషాలను తెలియజేసింది. ఈ నేపథ్యంలో తన సొంత అనుభవాలను కూడా పంచుకుంది. అయితే.. తనకు ఎదురైన పరాభావం గురించి మాత్రం ఏమీ మాట్లాడలేదు. అసలు తనతో జరిగిన ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోకూడదని తెలిపింది. ప్రస్తుతం తాను తన ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, గతంలో జరిగిన వ్యవహారాల గురించి అనవసరంగా మాట్లాడుదలచుకోలేనని తేల్చి చెప్పేసింది.

ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలో ‘‘సినిమా పబ్లిసిటీ కోసం నిర్మాతలు మీపై ఎక్కువ ఆధారపడుతన్నట్లు కనిపిస్తున్నారు. దీనిపై మీ స్పందనేంటి..?’’ అని అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన జవాబు తెలిపింది. ‘‘సినీ నిర్మాతలు నాపై ఆధారపడటంలో తప్పేముంది. నేను కూడా సినిమాలో భాగమే కదా. సినిమాను ప్రేక్షకులకు చేరువయ్యేలా పబ్లిసిటీ చేయాల్సిన బాధ్యత నాపై వుంది. కాబట్టి.. అలా చేయడంలో తప్పేమీ లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు... వ్యభిచారం కేసులో పట్టుబడటంతో నేపథ్యంలో సంచలనంగా మారిన ఈ భామను తమ మూవీ పబ్లిసిటీకి వాడుకుంటే ఎక్కువ క్రేజ్ వస్తుందనే నమ్మకంతోనే ఈమెతోనే ప్రమోషన్ కార్యక్రమాలను జరిపించేస్తున్నట్లున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైతేనేం.. ఈ దెబ్బతో శ్వేతాబసు కూడా పాపులారిటీని పొందుతోంది కదా! అని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles